క్రికెట్ లో అతి పొట్టి ఫార్మాట్ అయిన టీ 20 లో  నంబర్ వన్ బౌలర్ గా ఎదిగిన ఆఫ్గానిస్థాన్ చిచ్చర పిడుగు రషీద్ ఖాన్ మన తెలుగు వారందరికి సుపరిచితమే.ఇతను ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 290 వికెట్లు తీశారు. తమ దేశం తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక క్రికెటర్‌గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు.

తాజగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ ను యాంకర్ తన పెళ్లి గురించి అడగగా ఆఫ్గానిస్థాన్ ప్రపంచ కప్ గెలిచాక తను పెళ్లి చేసుకుంటానని సమాధానం చెప్పాడు.ప్రస్తుతం రషీద్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.