ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారింది కూర్గ్ భామ రష్మిక మందన్న. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రం తో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది రష్మిక.

Video Advertisement

 

 

ఇక ఈ స్టార్‌డమ్ ని పలు బ్రాండ్స్ తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్‌కి స్టార్ నటి రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనేక మెక్‌డొనాల్డ్స్ ప్రకటన ప్రకటనలలో రష్మిక మనకు కనిపించింది. ఈ బ్యూటీ పేరుతో ఆ సంస్థ భోజనం కూడా ప్రవేశ పెట్టింది. మెక్‌డొనాల్డ్స్ మెనూలో ‘ది రష్మికా మీల్’ని ప్రకటించింది.

rashmika into contraversy again..

అయితే అప్పట్లో రష్మిక తాను జంక్ ఫుడ్ కు దూరం గా ఉంటానని..బర్గర్ వంటి వాటిని ఎప్పుడో ఒకసారి తింటాను.. ఆరోగ్యమైన ఆహారాన్నే తినేందుకు నేను ఇష్టపడతాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ ఇటువంటి యాడ్స్ లో నటించడం తో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి మరో ఐటెం కోసం యాడ్ చేసింది. ఆ యాడ్ లో రష్మిక స్పైసీ చికెన్ బర్గర్‌ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

rashmika into contraversy again..

ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయ్యింది. అయితే రష్మిక గతంలో తాను ఒక శాఖాహారిని అంటూ పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు చికెన్ బర్గర్ ని తింటూ ఒక యాడ్ చేయడంతో ఆమె పై నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు. ఆమె అభిమానులు సైతం తమని మోసం చేయవద్దు అంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు.

rashmika into contraversy again..

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో పుష్ప 2 , నితిన్ తో ఒక సినిమా, అలాగే రైన్‌బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్న యానిమల్, పుష్ప 2 పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాలతో రష్మిక ఇంకెంతటి స్టార్‌డమ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

also read: రష్మిక, తమన్నా ఐపీఎల్ కోసం ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా?