రామాయణం భారతీయులకు ఎంత ముఖ్యమైన గ్రంథమో అందరికి తెలిసిందే. అందులోని ప్రతి భాగం నీతినే బోధిస్తుంది. ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. అందులోని ఘట్టాలన్నీ ధర్మాచరణకు అద్దం పడతాయి. శ్రీ రాముడు మొదలుకొని ప్రతి వ్యక్తి ఎంతో కొంత ప్రభావాన్ని మనపై చూపిస్తారు. వేల సంవత్సరాలుగా రామాయణం మనలో భాగం అయిపొయింది.

ఇందులో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు. భక్తి ప్రపత్తులు కలవాడు. శివుడి కి రావణుడు కంటే భక్తుడెవరు లేరని చెపుతుంటారు. అంతటి రావణుడు, ఒక్క స్త్రీ బలహీనత కారణం గానే విలన్ అవుతాడు. తపస్సులతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న రావణుడికి కూడా భక్తులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, స్త్రీ లోలత్వం కారణం గా శ్రీ రాముడి చేతిలో హతమయ్యాడు. రావణుడు బ్రహ్మజ్ఞాని. అతను చనిపోతూ , కొనఊపిరి తో ఉన్న సమయం లో.. అతని వద్ద నుంచి నాలుగు మంచి విషయాలు తెలుసుకోవాల్సింది గా రాముడు లక్ష్మణుడికి ఆదేశిస్తాడు. ఆ సమయం లోనే రావణుడు లక్ష్మణుడికి హితబోధ చేస్తాడు.

#1. నీ పక్కనే ఉండి నిన్ను విమర్శించే వారిని నెత్తిన పెట్టుకో, కానీ నిన్ను పొగిడేవారిని మాత్రం నమ్మొద్దని చెప్పాడు.
#2.ఎపుడు విజయం సాధిస్తున్నావు కదా అని గెలుపు నీ సొంతం అని విర్రవీగకు.
#3. యుద్ధం లో గెలవాలనే కోరిక ప్రతి రాజుకి ఉండాలి. కానీ, యుద్ధం అత్యాశ ఉండదు. సైన్యానికి కూడా అవకాశం ఇచ్చి, వారితో పాటు తానూ అలుపెరగక పోరాటం చేస్తేనే విజయం వరిస్తుంది.

#4. కాపలా కాసేవాడు, వంట చేసేవాడు, నీ రధ సారధి, తమ్ముడు.. వీరితో ఎవ్వరితోను శత్రుత్వం పెంచుకోకు. ఎందుకంటే, వీరితో శత్రుత్వం పెంచుకుంటే ఏరోజైనా, ఏ క్షణమైనా నీకు హాని చేసే ప్రమాదం ఉంటుంది.

#5. నీ శత్రువు చిన్న వాడు అనుకుని తక్కువ అంచనా వేయవద్దు. ఎవరి వెనుక ఎంత బలం ఉందొ ఎవరికీ తెలియదు. నేను ఆంజనేయుడిని తక్కువ అంచనా వేయడం వల్లనే ప్రాణాలపైకి తెచ్చుకున్నాను.
#6. దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు. కానీ ఆయన పట్ల దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండు.

ఈ మాటలను లక్ష్మణుడికి చెబుతూ, రావణుడు ప్రాణాలు విడిచాడు. రావణుడు చెప్పిన మాటలు నేటికీ, మన జీవితాలకు వర్తిస్తాయి.