రవితేజ హీరోగా రావణాసుర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ కనిపించని పాత్ర లో దర్శనమిచ్చారు. శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీ శర్మ వంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

Video Advertisement

 

 

అయితే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయిందన్న వార్తలు వచ్చాయి. దీంతో సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రం లో రవితేజ నెగటివ్ క్యారక్టర్ చెయ్యడం వల్ల ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అందుకే సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. హీరో గా మాత్రమే కాదు, నిర్మాత గా కూడా రవితేజ కి భారీ నష్టాన్ని కలిగించింది ఈ చిత్రం.

RAvanasura movie got sensational responce in OTT..!!

దీంతో ఈ చిత్రం విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే  ఓటీటీ కి వచ్చి రెండు వారాలు అవుతున్నా టాప్ 4 లో ట్రెండింగ్ అవుతుంది ఈ చిత్రం. అమెజాన్ ప్రైమ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు సైతం ‘అరే.. సినిమా బాగానే ఉందిగా..’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

RAvanasura movie got sensational responce in OTT..!!

ఇక సినిమా కథ ఓల్డ్‌ రివైంజ్‌ స్టోరీయే అయినప్పటికీ దర్శకుడు కథ చెప్పిన విధానం సరికొత్తగా ఉంది. రవితేజ ఎందుకు అంత నెగటివ్ గా మారిన అందరినీ చంపుతున్నాడు అనే దానికి డైరెక్టర్ సుధీర్ వర్మ ఇచ్చిన కారణం ఆడియన్స్ కి బాగా నచ్చింది. అయితే థియేటర్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న రావణాసుర ఓటీటీలో మాత్రం మంచి టాక్‌ తెచ్చుకోవడంతో రవితేజ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.