Ads
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరహర వీరమల్లు’. తన కెరీర్లో మొట్టమొదటిసారి ఇటువంటి చిత్రాన్ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత.. కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాని ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ద్వారా మంచి మార్కులు కొట్టేసిన క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ అసలు హరహర వీరమల్లు ఎవరో.. ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకుందాం..
Video Advertisement
క్రీస్తు శకం 11 వ శతాబ్ద కాలం లో భారత దేశం మీదకు అనేక రాజ్యాల వారు దండెత్తి వచ్చేవారు. మన సంపదను కొల్ల గొట్టటానికి, ఇక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు భారత దేశం లోకి మహమ్మదీయులు చొరబడ్డారు. 13 శతాబ్ద కాలానికి సుల్తానులు చాలా వరకు భారతదేశాన్ని తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. అప్పటికి మన దేశము హిందూ రాజుల చేతుల్లో ఉండేది. యాదవుల దేవగిరి, కాకతీయుల వరంగల్, హౌసల ద్వారా సముద్రం, మధుర పాండ్యులు వివిధ భాగాల్ని పరిపాలించేవారు. తర్వాత ఢిల్లీ లో మహ్మద్ తుగ్లక్ పాలన మొదలైన తర్వాత భారత దేశ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది.
అప్పుడు కాకతీయుల సంస్థానం లో హరిహర, అతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా ఉన్నారు. తర్వాత కంపిలి రాజ్యానికి చేరి.. కంపిలి దేవ వద్ద సహాయకులుగా చేరారు. ఆ తర్వాత తుగ్లక్ 1326 లో కంపిలి ని జయించినప్పుడు బందీలుగా వీరిద్దరూ ఢిల్లీ తరలించబడ్డారు. కొన్ని అనూహ్య పరిణామాల అనంతరం సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మారారు. తర్వాత సుల్తాన్ ఆదేశం తో ఏకంగా కంపిలినే స్వాధీనపరుచుకున్నారు.
శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో హిందూ మతాన్ని స్వీకరించిన అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి సుల్తాన్ ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న వీర హరిహర క్రమంగా మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇదే సమయంలో హోసల రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు వీర హరి హరుడు. ఇది ఒక చెప్పుకోదగ్గ విజయం అని చరిత్ర కారులు వెల్లడించారు.
1346 కాలంలో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో ’హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు’ అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది. హరి హర వీర మల్లు ది సంగమ వంశం. వీరిది సంగమ రాజ వంశం అని అంటారు. హరి హరుడికి నలుగురు సోదరులు ఉన్నారు. వారు కంపన్న, బుక్క, మరప్ప, మడప్ప. వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి హరి హరకు సహకరించారు. ఆలా విజయ నగర సామ్రాజ్యం మూడు శతాబ్దాల వరకు సుసంపన్నమైన రాజ్యం గా వర్ధిల్లింది.
End of Article