Ads
ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తుపూర్వం 558 లో జన్మించారు. ఈయన భట్టియా అనే గ్రామ అధిపతి కుమారుడు.
Video Advertisement
బింబిసారుడు క్రీస్తుపూర్వం 543 లో 15 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్టించారు. బింబిసారుడు కాలంలో భరత ఉపఖండంలో మహా జనపదాలు మరియు జనపదలు అనే రెండు ప్రధాన రాజకీయ విభాగాలుగా ఉండేవి. గొప్ప రాజ్యాలైన మహా జనపదాలు 16 ఉండేవి. ఇందులో కొన్ని స్వతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి.
వీటిలో ముఖ్యంగా నాలుగు పెద్ద రాజ్యాలు ఉండేవి. అవి అవంతి, కోసల, వత్స మరియు మగధ రాజ్యాలు. ప్రస్తుతం భారతదేశంలో దక్షిణ బీహార్ ప్రాంతమే ఒకప్పటి భారత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మ దత్త అనే రాజు చేతిలో తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన శత్రువు రాజ్యమైన అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడు అజాతశత్రువుని అంగరాజ్యానికి గవర్నర్ గా నియమించారు.
బంగాళాఖాతం సమీపంలో ఉన్న ఈ అంగరాజ్యాన్ని జయించడం వలన అంగ రాజ్యాలకు సముద్రం మార్గాలపై, గంగా డెల్టాకి వెళ్లే రాజ్యాలపై మగధ రాజ్యానికి నియంత్రణ లభించింది. అంతేకాకుండా ఇది మగధ రాజ్యానికి విదేశీ వాణిజ్య అభివృద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడింది. ఈ విజయం మగధ సామ్రాజ్యం విస్తరణకు పునాదులు వేసినట్లు భావించబడుతుంది.
ఆ తర్వాత బింబిసారుడు తన భరతఖండంలోని ఇతర శక్తివంతమైన రాజ్యాలపై దృష్టి మళ్ళించారు. బింబిసారుడు చాలా సమర్థవంతమైన సైనికాధికారి. తన సైన్య పరిధిని తెలిసిన అతను తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి యుద్ధాలలో లొంగలేని రాజ్యాలను వివాహ సంబంధాలతో దక్కించుకునేవారు. కోసల రాజు మహా కోసల కుమార్తె, ప్రసేనజితు సోదరీ కోసల దేవిని వివాహం చేసుకున్నాడు బింబిసారుడు.
ఈ కోసల దేవి బింబిసారుని మొదటి భార్య. కోసల దేవిని వివాహం చేసుకోవడం ద్వారా కాశీని కట్నంగా పొందారు. మంచి ఆదాయ వనరుగా కాశీ ఉండటంతో మగధ ఖజానా మరింత బలోపేతం అయ్యింది. వివాహం బంధంతో కోసల మరియు మగధ రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపివేసింది. అంతేకాకుండా ఇతర రాజ్యాల తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించింది.
ఆ తర్వాత వైశాలి ప్రాంతానికి చెందిన జైన రాజు చేతక కుమార్తె అయిన విచ్చాలి రాజకుమారి చెల్లనను వివాహం చేసుకున్నారు బింబిసారుడు. ఆ తర్వాత మూడో భార్యగా పంజాబ్ లో మద్రా వంశానికి చెందిన క్షేమను వివాహం చేసుకున్నారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన పవిత్ర గ్రంథమైన మహావగ్గ లో బింబిసారుడికి 500 మంది భార్యలు అని అభివర్ణించారు. అంతేకాకుండా జైన గ్రంథాలలో బింబిసారుని సైనిక్ అని పేర్కొన్నారు. సైనిక్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయిన యుద్ధానికి సిద్ధమైన సైన్యాన్ని కలిగి ఉన్న వాడు అని అర్థం.
బింబిసారుడు కేవలం ధైర్యవంతమైన రాజు మాత్రమే కాదు. పొరుగు రాజ్యాలతో సామరస్యమైన సంబంధాలను కొనసాగించే సహృదయుడు. తన రాజ్యాన్ని సుస్థిరపరచడానికి అత్యంత శక్తివంతమైన అవంతి రాజ్యం దాని రాజధాని ఉజ్జయిని పై తన దృష్టిని కేంద్రీకరించాడు. కానీ అనేక యుద్ధాల తర్వాత కూడా బింబిసారుడు కాని, అవంతీరాజు ప్రద్యోతుడు కాని విజయం సాధించలేదు. బింబిసారుడు మంచి వ్యూహాత్మక కలవాడు కావడంతో ప్రద్యోతతో స్నేహం ఏర్పరచుకున్నారు. రాజు ప్రద్యోత ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు కామెర్ల వైద్య చికిత్స కోసం తన వైద్యుడైన జీవకాను వ్యాధి నయంచేయడానికి ఉజ్జయిని పంపారని బౌద్ధ వర్గాలు పేర్కొంటున్నాయి.
మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని అయిన రాజగృహ, దీనిని రాజగిరి, గిరివ్రజా అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పటికి కూడా జైనులకు పవిత్ర తీర్థయాత్ర స్థలంగా ఉంది. ఆ తర్వాత రాజధాని పాటలీపుత్ర కు మార్చబడింది. బౌద్ధ రచనలలో రాజగృహ నగరానికి బింబిసారుడు నిర్మించాడు అని బౌద్ధమత వ్యవస్థాపకులైన గౌతమ బుద్ధుడు తన జీవిత కాలంలో ఎక్కువ కాలం మగధ సామ్రాజ్యం లోనే గడిపాడని చెబుతారు. బింబిసారుడు పాలించిన రాజ్యంలోని బౌద్ధమతం వ్యవస్థాపకులైన గౌతమ బుద్ధుడు మరియు జైన మత వ్యవస్థాపకులైన మహావీర వద్దమాన ఇద్దరూ తమ బోధలను ప్రారంభించారని చెబుతారు.
బౌద్ధ, జైన మతాలు అక్కడే ప్రసిద్ధి చెందిన బింబిసారుడు మాత్రం ఏ మతాన్ని ఆచరించరో అనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టత లేదు. కాని బౌద్ధ, జైన మతాలు రెండు బింబిసారుడు తమ మతస్థుడుగానే చెప్పుకుంటాయి. మగధ రాజ్య సింహాసనాన్ని అధిరోహించటానికి బింబిసారుని కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదీగా చేశాడు. జైనా మరియు బౌద్ధ మతాల రచనల ప్రకారం బింబిసారుని మరణం వెనక భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. జైన గ్రంధాలు బింబిసారుడు విషం తాగి చెరలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నాయి.
బౌద్ధ గ్రంథాలు బింబిసారుడు కుమారుడైన అజాతశత్రు బుద్ధుని దుష్ట బంధుమ అయిన దేవదూత ప్రభావంతో తన తండ్రి బింబిసారుడి చంపాడని పేర్కొన్నాయి. ఇంకొక కథ అజాతశత్రువు తన మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే తండ్రిని విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అవడంతో క్రీస్తుపూర్వం 491 లో బింబిసార మరణించాడు.
పురాణాల ప్రకారం బింబిసారుడు మగధ రాజ్యాన్ని 28 లేదా 38 సంవత్సరాలు పాలించారు అని పేర్కొన్నాయి. అదేవిధంగా సింహాళ చారిత్రక రచనలలో బింబిసారుడు 52 సంవత్సరాలు పాలనచేశారని చెబుతున్నాయి. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన సమర్ధుడైన పాలకుడుగా మాత్రమే కాకుండా భారతదేశ మొదటి ప్రధాన పాలకుడిగా కూడా అతను చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు. బింబిసారుడు ఏకీకృతం చేసి పాలించిన మగధ సామ్రాజ్యాన్ని ఆ తర్వాత కాలంలో నంద మరియు మౌర్య సామ్రాజ్యలకు గట్టి పునాదిని వేసింది.
End of Article