Ads
మీరెప్పుడైనా గమనించారా..? అంబులెన్స్ లకు లాగానే పోలీస్ వాహనాలకు కూడా ప్రత్యేక హారన్ ఉంటుంది. అలానే.. పోలీస్ వాహనాలపై కూడా ఎరుపు, నీలం రంగుల లైట్లు ఉంటాయి. ఈ లైట్లను ఎందుకు ఏర్పాటు చేసారు.. ఈ రంగులను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు..? అన్న విషయాలను మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Video Advertisement
పోలీస్ వాహనాన్ని అధికారులు వాడుకోవడం కోసం తో పాటు.. ప్రజల్లో అప్రమత్తం కలిగించడమే లక్ష్యం గా ఏర్పాటు చేసారు. ఎరుపు రంగు అనేది అప్రమత్తత కు చిహ్నం. ఇది ఓ హెచ్చరిక కు గుర్తు గా మనం భావిస్తూ ఉంటాం. ఎరుపు రంగు చూడగానే మనం ఆటోమేటిక్ గా అలెర్ట్ అయిపోతాం.. అందుకే పోలీస్ వాహనాలపై ఉండే లైట్లలో కూడా ఈ రంగు ఉండేవిధం గా చర్యలు తీసుకున్నారు.
అయితే, రోడ్డు పై ఇతర వాహనాలు కూడా ఎక్కువ గా తిరుగుతూనే ఉంటాయి. పైగా.. చాలా వెహికల్స్ కి బ్యాక్ ఉండే లైట్స్ ఎరుపు రంగులోనే ఉంటాయి. ఇంత వెలుతురూ లో పోలీస్ వాహనాలపై ఉండే ఎరుపు రంగుని గుర్తించడం కష్టం అవుతుంది. అందుకే ఎరుపు రంగు తో పాటు మరేదైనా రంగు ని కూడా జత కలపాలని నిర్ణయించారు. ఇతర వాహనాలలో నీలం రంగుని తక్కువ గా ఉపయోగిస్తారు కాబట్టి.. నీలం రంగు కూడా ప్రత్యేకం గా కనబడుతుందన్న ఉద్దేశం తో ఈ రంగు ని జత కలిపారు.
పగటి సమయాల్లో ఎరుపు రంగుని తేలికగా గుర్తించగలుగుతాము. అలానే, రాత్రి సమయాల్లో నీలం రంగుని తేలిక గా గుర్తిస్తాము. ఈ రెండు ప్రత్యేకం గా ఉంటాయి కాబట్టే ఈ రంగుల్ని ఎంచుకున్నారు. పోలీస్ వాహనం ద్వారా ప్రజలను అలెర్ట్ చేయడం కోసం ఈ రంగులను ఎంచుకున్నారు. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు రంగుల్ని ఉపయోగించడం వలన చూడడానికి ఎలాంటి సమస్య ఉండదు. ఎరుపు రంగు చూడడానికి ఇబ్బంది ఉన్నవారు నీలం రంగుని సులభం గా గుర్తించగలుగుతారు.
End of Article