ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా వెండితెరకు పరిచయమైన శ్రీ సింహా “మత్తు వదలరా” సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. భిన్నమైన స్క్రీన్ ప్లే కథను ఎంచుకొని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సింహ, ఆ తరువాత కూడా “తెల్లవారితే గురువారం” వంటి విభిన్నమైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Video Advertisement

సింహా ఇప్పుడు “దొంగలున్నారు జాగ్రత్త” అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ అని మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమాని ‘గురు ఫిల్మ్స్’ మరియు ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మించగా..కొత్త డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు.

reason behind dongalunnaru jagratta movie release
ఈ సినిమా విడుదలైంది, సినిమాలో పెద్దగా విషయం లేదు, వెళ్లిపోయింది. దీంతో అసలు ఈ సినిమా ఎందుకు థియేటర్లలో రిలీజ్‌ చేశారు, అసలు థియేటర్లలో విడుదల చేయాల్సిన సినిమానా అనే ప్రశ్న వినిపిస్తోంది. సినిమా సరైన స్టఫ్‌ లేదని అందుకే ఆడలేదని అంటున్నారు. ఓటీటీకి ఈ సినిమా ఇస్తే సరిపోయేది కదా అని కూడా అంటున్నారు. ఇంకొందరైతే అసలు ఎక్కడ రిలీజైంది ఈ సినిమా, ఎక్కువ థియేటర్లలో కనిపించడం లేదే అని అంటున్నారు. దీంతో అసలు ఏమైందా అనే చర్చ నడుస్తోంది.

reason behind dongalunnaru jagratta movie release
అయితే శ్రీసింహా సినిమా అయితే.. మొత్తం కుటుంబం వచ్చి ప్రమోట్‌ చేసింది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావుడి కూడా పెద్దగా లేదు. శ్రీసింహా కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్పే పెద్దగా ఏమీ చేసింది లేదు. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ రేగింది.

reason behind dongalunnaru jagratta movie release
ఒక అసలు విషయానికి వస్తే.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు ఓటీటీ డీల్ ఎప్పుడో పూర్తయిందట. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే నేరుగా ఓటీటీ అంటే ప్రచారం సరిగా రాదు. పెద్ద సినిమా ఓకే అయితే ఓకే. కానీ చిన్న సినిమా స్ట్రెయిట్‌ ఓటీటీ అంటే అంత విలువ ఉండదు. అందుకే నేరుగా థియేటర్లలో విడుదల చేసి మమ అనిపించి.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌ చేస్తారు అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్. గంటన్నర నిడివిలోనే సినిమా ఉంటుంది.

reason behind dongalunnaru jagratta movie release

నిజానికి ఇలాంటి సినిమాలు ఓటీటీలకే సూటవుతాయి అని అంటుంటారు. కాబట్టి ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు వచ్చి జనం చూడడం కష్టమే. ఇదంతా అర్థం చేసుకునే చిత్రబృందం అలా థియేటర్లలో విడుదల చేసేసి.. వారానికో, రెండు వారాలకో ఓటీటీకి ఇచ్చేస్తారట. ఈ సినిమాది కూడా అదే పరిస్థితి అంటున్నారు జనాలు.