రైలు కిటికీలకు ఇనుప కడ్డీలు నిలువుగా కాకుండా అడ్డంగా ఎందుకు బిగిస్తారు..? దీని వెనుక ఇంత కథ ఉందా..?

రైలు కిటికీలకు ఇనుప కడ్డీలు నిలువుగా కాకుండా అడ్డంగా ఎందుకు బిగిస్తారు..? దీని వెనుక ఇంత కథ ఉందా..?

by Anudeep

Ads

మనం ఇప్పటి వరకు ఎన్నోసార్లు ట్రైన్ లో ప్రయాణం చేసి ఉంటాం.. లేదా కనీసం ట్రైన్ ని చూసి అయినా ఉంటాం. మిగతగా రవాణా వ్యవస్థలతో పోలిస్తే (బస్సు, విమానం, పడవ) రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది పైగా సేఫ్టీ కూడా ఎక్కువే.

Video Advertisement

భారత దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉంది కూడా రైల్వే వ్యవస్థనే. మొదటి మన దేశంలో రైలు మార్గం ప్రారంభించింది బ్రిటిష్ వారి కాలంలోనే. అప్పటికీ ఇప్పటికీ రైలు మార్గాలు, రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు అనేక ట్రైన్లలో ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించారు.

అయితే మనం ఎప్పుడూ చూసే ట్రైన్ లో కిటికీలకు ఇనుప కడ్డీలు నిలువుగా ఉండడాన్ని మీరు గమనించారా..?
నిలువుగా కాకుండా అడ్డంగానే ఎందుకు ఉండవు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా..? ట్రైన్ లో విండోస్ నిలువుగా ఎందుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

#1. సౌలభ్యత:

 

నిలువు కడ్డీలు ఉంటే.. లోపలి నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడానికి, ఇవ్వడానికి ప్రయత్నించండి కష్టంగా ఉంటుంది కదా.. అదే కడ్డీలు అడ్డంగా ఉండే.. తీసుకోవడం ఇవ్వడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా రైళ్ళలో తినుబండారాలు,కాఫీ కప్పులు ఇలాంటివి అడ్డంగా ఉండే కడ్డీలలో సులభంగా ఇవ్వొచ్చు.

#2. కంటికి ఇంపుగా ఉండటం:

నిలువు కడ్డీలు, ఏదో నిర్భంధం అన్న ఫీలింగ్ మనసులో కలిగిస్తాయి. ఉదాహరణకు జైలు చువ్వలు, ఇంటి ఫెన్సింగ్ , పక్షి పంజరం, జంతువుల ఉంచే డబ్బాలు వీటన్నింటికి నిలువు కడ్డీలే ఉంటాయి.

#3. సులభంగా వంగుతాయి:

ఎక్కువ వ్యాసాల్లో, వంచవలసి వస్తే, అడ్డం చువ్వలు, నిలువు వాటి కంటే సులభంగా వంగుతాయని నిపుణులు అంటారు. బహుశా ప్రమాదాల దృష్ట్యా సులభంగా వంగేవి  అడ్డం కడ్డీలే అన్నమాట.

#4. అత్యవసర పరిస్థితుల నుంచి బయట పడేందుకు:

మొదటి నుండి ఇవి ఇలా లేవు. క్రమంగా పరిణామం చెందాయి. అందుకే వాడుకలో, అమర్చటంలో, అలానే మైంటైన్ చేయడంలో సులువు ఉండే ఉంటుంది. అలాగే ఎమర్జన్సీ కిటికీలలో, తీసే వీలు లేని కిటికీలలో నిలువు చువ్వలు ఉంటాయి. సాధారణ తరగతి, స్లీపర్ బోగీల్లో మాత్రమే ఇవి మీకు కనిపిస్తాయి.

#5. దొంగల నుంచి రక్షణ:

 

దొంగతనాలకు ఇవి నిజానికి అనుకూలం. ఎలా అంటారా, తలుపు పక్కని ఉండే కిటికీ ఎప్పుడైనా చూసారా? ఎర్ర బాక్స్ లో ఉన్న కిటికీలకి మిగతా కిటికీల కంటే తక్కువ దూరంలో కడ్డీలు ఉంటాయి. తలుపులోంచి దిగుతూ పక్కని కూర్చుని ఉన్న వారి వస్తువులు సులభంగా లాగేసే, దొంగల నుంచి రక్షణ కోసం ఇవి అలా ఉంటాయి.

తలుపుల కున్న కడ్డీలు కూడా అంతే. సులభంగా చేయి పెట్టి, తలుపు లాగే అవకాశం లేకుండా, కట్టుదిట్టం కోసం అలా ఉంచారన్న మాట. అసలు కడ్డీలే ఎందుకు అంటే.. తల బయట పెట్టి ప్రమాదం కొని తెచ్చుకోకుండా, కిటికీలోంచి చిన్న పిల్లలు, విలువైన వస్తువులు పడిపోకుండా, బయట నుండి ఎగిరి వచ్చే రాళ్ళు, ఇంకేదైనా లోనికి రాకుండా, జాగ్రత్త కోసం మొత్తానికి అడ్డం కడ్డీల వెనుక ఇంత కథ ఉందన్నమాట!


End of Article

You may also like