ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఆ రంద్రం ఎందుకుంటుందో తెలుసా?

ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఆ రంద్రం ఎందుకుంటుందో తెలుసా?

by Anudeep

మన రోజువారి జీవితంలో అనేక వస్తువులను చూస్తూ ఉంటాం..కొన్ని వస్తువులను చూస్తే వీటి షేప్ ఎందుకిలా ఉంది..ఇలా కాకుండా మరోలా ఉంటే ఎలా ఉండుండేది అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం.కొన్ని ఆలోచనలు,కొన్ని డౌట్స్ చాలాసిల్లిగా ఉంటాయి..కానీ వాటి వెనుక కారణాలు మాత్రం పెద్దవిగానే ఉంటాయి..అలాంటిదే స్టూల్స్ మద్యలో ఉండే హోల్…

Video Advertisement

స్టూల్స్ కి మాత్రమే కాదు, ప్లాస్టిక్ చెయిర్స్ కి కూడా కూర్చునే భాగంలో ఒకటి లేదా రెండు హోల్స్ ఉంటాయి..అవును మీరెప్పుడైనా స్లూల్స్ ని,ప్లాస్టిక్ చెయిర్స్ ని చూస్తే దానికి హోల్ ఉండడాన్ని గమనించారా..అసలు అవి ఎందుకుంటాయి అని ఆలోచించారా?వాటిని అలా రూపొందించడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటంటే..

  • మనం సాధారణంగా స్టూల్స్ ని కానీ,ప్లాస్టిక్ చెయిర్స్ ని కానీ ఒకదాంట్లో ఒకటి వేసేస్తుంటాం..అలాంటప్పుడు స్టూల్స్ మధ్యలో రంధ్రాలు లేనట్లయితే, రెండు కుర్చీల ఖాళీలో ఏర్పడిన “వాక్యూమ్” వల్ల ఏర్పడే గాలి పీడనం కారణంగా కుర్చీలు ఒక దానితో ఒకటి ఇరుక్కుపోతాయి.అలా కాకుండా ఈ హోల్స్ ఉండడం వలన ఆ సమస్య ఉండదు.
  • అంతేకాదు..దీని వలన ఉన్న మరో ఉపయోగం  ఆ కుర్చీల తయారికి వాడిన మెటిరియల్ ఆదా అవుతుంది.అంటే డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది.. ఆ హోల్స్ లో భర్తీ చేయాల్సిన మెటిరియల్ తో కొత్త ప్రొడక్స్ కూడా తయారు చేయవచ్చు.

  • ఇక చివరి ఉపయోగం ఏంటంటే..స్టూల్స్ మద్యలో ఆ  హోల్స్ ఉండడం వలన వాటిని ఒక దగ్గర నుండి మరొక దగ్గరకి చేర్చేటప్పుడు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది..
  • సరిగ్గా గమనించినట్టైతే ఈ స్టూల్స్ మధ్యలో ఉండే రంధ్రాలన్ని గుండ్రంగానే ఉంటాయి..స్క్వేర్ శేప్ లేదంటే మరే ఇతర శేప్లో ఉండవు..ఈ గుండ్రటి శేప్ మూలంగా చెయిర్ పై అధిక బరువు ప్రెజర్ పడినప్పుడు విరిగిపోకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది.

You may also like