రైల్వే ప్లాట్ ఫామ్ పై ఈ పసుపు రంగు గీత ఎందుకు ఉంటుందో తెలుసా..? అసలు కారణం ఇదే..!

రైల్వే ప్లాట్ ఫామ్ పై ఈ పసుపు రంగు గీత ఎందుకు ఉంటుందో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మనం ఒక చోటు నుండి వేరే చోటుకు ప్రయాణించడానికి ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి. అందులో మనందరం ఎక్కువగా వాడేది బస్, ట్రైన్, లేకపోతే ఫ్లైట్. ఇందులో చాలా మంది ట్రైన్ ప్రయాణాలను ఫ్లైట్ ప్రయాణాల ని ఇష్టపడతారు. అయితే బస్ లో కానీ, ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ ప్రయాణించేటప్పుడు మనం చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ ఉంటాం కానీ మనం కూర్చున్న బస్ ని కానీ, ట్రైన్ ని కానీ ఫ్లైట్ ని కానీ ఎక్కువగా పట్టించుకోము.

Video Advertisement

yellow line

మనం ట్రైన్ ఎక్కడానికి ఎన్నో సార్లు రైల్వే స్టేషన్ కు వెళ్లి ఉంటాం. కానీ.. రైల్వే స్టేషన్ లో ఉండే ఎన్నో చిన్న చిన్న అంశాలను మనం పట్టించుకోము. మనకి ట్రైన్ టైం కి అందుకోవాలి అన్న ధ్యాసే ఉంటుంది తప్ప..పరిసరాలపై దృష్టి నిలపలేము. మీరెప్పుడైనా గమనించారా.. రైల్వే ప్లాట్ ఫామ్ పై ఎరుపు రంగు బ్లాక్ ఉంటుంది. దానికి ఆనుకునే పసుపు రంగు గీత ఉంటుంది. అయితే.. ఈ రంగు గీత ఎందుకు ఉంటుందో తెలుసా..?

yellow line 3

పట్టాలపైనుంచి రైలు వెళ్తున్న సమయం లో.. పరిసరాల్లో ఎక్కువ గా గాలి వీస్తుంది. ఆ టైం లో రైలు ప్రక్కగా ఎవరైనా నుంచుంటే.. ఆ గాలి వలన వారు రైలు వైపుకి వెళ్లి.. కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. అటు వైపు ఎవ్వరూ వెళ్ళకూడదు అని చెప్పడానికి ప్లాట్ ఫామ్ పై కొంత భాగాన్ని ఎరుపు రంగు పెయింట్ తో కప్పుతారు. దానికి ఆనుకునే పసుపు రంగు గీతను కూడా గీస్తారు.

yellow line

అంటే.. ఆ ఎరుపు రంగు ఉన్న బ్లాక్ లో ఎవరు నుంచోకూడదు అని చెప్పడానికి అలా గీస్తారు. ఆ పసుపు రంగు గీత దాటి ముందుకు వెళ్ళకూడదు అని ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ప్రయాణీకులకు తెలియచెప్పడం కోసం ఇలా గీత గీస్తారు.


End of Article

You may also like