మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగష్టు 15, 1947 న నెహ్రు గారు జండా ఎందుకు ఎగురవేయలేదు..? అసలు కారణం ఇదే..!

మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగష్టు 15, 1947 న నెహ్రు గారు జండా ఎందుకు ఎగురవేయలేదు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు భారత్ ను పరిపాలించారన్న సంగతి అందరికి తెలిసిందే. ఎందరో స్వాతంత్ర సమర యోధులు భారత్ కు దాస్యం నుంచి విముక్తి కల్పించాలని ప్రయత్నించారు. ఆరోజు వారు చేసిన పోరాటాల త్యాగ ఫలమే.. నేటి మన స్వాతంత్రం. అందుకే.. ఈరోజున వారందరిని స్మరించుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం.

Video Advertisement

august 15

స్వాతంత్ర దినోత్సవం అనగానే.. అందరు తమ ఆఫీస్ లలోను, పాఠశాలల్లోనూ, కళాశాలల్లోను జరిగే జండా వందనం వేడుకను గుర్తు చేసుకుంటారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జండా ను ఎగురవేసి, మిఠాయి పంచుకోవడం అనేది కొన్నేళ్లు గా వస్తున్న సంప్రదాయమే. పిల్లలకు కూడా స్వాతంత్రం సంపాదించి పెట్టిన ధీరుల గురించి తెలియచెప్పే రోజిది. అయితే.. మొట్ట మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున మాత్రం దేశ ప్రధాని అయిన నెహ్రు గారు జండా వందనం చేయలేదన్న సంగతి మీకు తెలుసా..?

independance day 1

అసలు మొట్ట మొదటి స్వతంత్ర సంబరాలకు జాతి పిత మహాత్మా గాంధీ గారు కనీసం హాజరు కూడా కాలేదు. ఎందుకంటే.. ఆ సమయానికి గాంధీ గారు బెంగాల్ లోని నోవాఖలి ప్రాంతం లో ఉన్నారు. అక్కడ హిందువులకు, ముస్లింలకు మధ్య మత సంఘర్షణలు జరుగుతున్నాయి. ఆయన ఆ సమయం లో వారి మధ్య సామరస్యత నెలకొల్పడం కోసం నిరాహార దీక్షను చేస్తూ ఉన్నారు. ఆగష్టు 15 న స్వాతంత్రం వస్తుంది అని తెలిసిన వెంటనే నెహ్రు గారు, వల్లభ భాయ్ పటేల్ గారు కూడా మహాత్మా గాంధీ కి లేఖ రాశారట.

independance day 3

ఈ వేడుకకు హాజరు అవ్వాలని కోరారట. కానీ గాంధీ గారు అందుకు సున్నితం గా తిరస్కరించారు. ఓ వైపు హిందూ-ముస్లిం లు ప్రాణాలు తీసుకుంటున్నారు.. ఈ పరిస్థితిలో నేను సంబరాలు ఎలా జరుపుకుంటాను అని మధనపడేవారట. ఆగష్టు 14 న రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచే నెహ్రు గారు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ అనే తన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నా కూడా.. గాంధీగారు మాత్రం 9 గంటలకే నిద్రపోయారట.

independance day 2

మరుసటి రోజు దేశానికీ అధికారికం గా స్వతంత్రం వచ్చినరోజు. ప్రతి ఏడాది ఈరోజే జండాను ఎగురవేస్తారు. కానీ ఆగష్టు 15 1947 న మాత్రం అలా అవలేదు. నెహ్రు తన చారిత్రక ప్రసంగాన్ని ఇచ్చేనాటికి ప్రధాని అవ్వలేదు. ఆగష్టు 15 మధ్యాహ్నం 12 గంటల సమయం లో లార్డ్ మౌంట్‌బాటన్ పని పూర్తి చేసుకుని మంత్రి మండలి లిస్ట్ ను నెహ్రు కు అప్పగించారు. ఆ తరువాత రోజు జండా వందనం జరిగింది. అప్పటి లోక్ సభ లో సెక్రటేరియట్ పత్రాలలో ఉన్న సమాచారం ప్రకారం ఆగష్టు 16 వ తేదీన ఎర్రకోట పై తొలి జండా రెపరెపలాడింది.


You may also like