Ads
మానవ శరీరం తన సమస్యను తానె గుర్తించి పరిష్కరించుకోగలదు. అయితే.. మనం చేయాల్సిందల్లా మితమైన ఆహరం తీసుకుంటూ.. సమయపాలన పాటించడమే. కానీ, మనం అదే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన శరీరం లోపల ఏమైనా అనారోగ్యం గా ఉన్నా కూడా.. ఆ సంకేతాలను కూడా శరీరం అందిస్తూ ఉంటుంది. వాటిల్లో మొట్ట మొదటిది మన మూత్రమే. మన మూత్రం ఉన్న రంగుని బట్టి మనకు ఏ అనారోగ్య సమస్య ఉందో యిట్టె చెప్పేయచ్చు. వైద్య విధానాలలో కూడా ప్రాధమికం గా మూత్రాన్ని పరీక్షించే అనారోగ్య సమస్యలను గుర్తిస్తారు.
Video Advertisement
మన మూత్రం ఇచ్చే సంకేతాలను బట్టి మనకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందొ యిట్టె తెలుసుకోవచ్చు. కొంతమందికి మూత్రం లో నురగ వస్తూ ఉంటుంది. అయితే.. ఇది పెద్ద సమస్యే కాదు అనుకుని చాలా మంది పట్టించుకోరు. కానీ ఇలా వస్తున్నప్పుడు అశ్రద్ధ చేస్తే ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మూత్రం లో ఇలా నురగ రావడానికి మూడు వ్యాధులు కారణం అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శరీరం లో ఏర్పడే వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపించడానికి కిడ్నీలు నిరంతరం శ్రమిస్తూ ఉంటాయి. అయితే.. ఈ కిడ్నీలలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు.. లేదా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ముందు గా ఇలా మూత్రం లో నురగ వస్తూ ఉంటుంది. అలా గమనించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇలా మూత్రం లో నురగ వస్తూ ఉంటుంది. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి షుగర్ లెవెల్స్ అధికం గా ఉంటాయి. అందువలన మూత్రం లో కూడా గ్లూకోస్ ఎక్కువై నురగ వస్తుంది. ఇక ఇవి రెండు కాకుండా.. ఎవరికైనా మూత్రాశయం లో ఇన్ఫెక్షన్ ఉంటె.. వారికి కూడా నురగ వస్తుంటుంది. ఇలా కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
End of Article