మాధవన్ నటించిన ది రైల్వే మెన్ చూశారా..? ఎలా ఉందంటే..?

మాధవన్ నటించిన ది రైల్వే మెన్ చూశారా..? ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

వాస్తవ గాధలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించే వెబ్ సిరీస్ లకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుంది భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ సంస్థ దీనిని తెరకెక్కించింది. నెట్ ఫిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం….!

Video Advertisement

ఇఫ్తికార్ సిద్ధికి (కేకే మీనన్) గోపాల్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్. ఆయనంటే స్టేషన్ లో అందరికీ ఆపరమైన గౌరవం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడు. మరోపక్క భోపాల్ నడిబొడ్డులో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని విదేశీ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది.

the railway menభద్రత విషయంలో కనీస ప్రమాణాలు పాటించదు. ఫ్యాక్టరీలోని సీనియర్ వర్కర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తే నష్టాలు గురించి మాట్లాడతారు తప్ప వాటిని పట్టించుకోరు. ఫ్యాక్టరీ కి పక్కనే ఉన్న బస్తీలో నివసిస్తుంటాడు ఇమాద్(బాబిల్ ఖాన్). అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇమాద్ తన స్నేహితుడు మరణించడంతో అక్కడ మానేసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో జాయిన్ అవుతాడు. ఇమాద్ ద్వారా ఫ్యాక్టరీలోని లోపాలు తెలుసుకున్న రిపోర్టర్(సన్నీ ఇందుజా) దానికి సంబంధించిన నివేదిక కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్ అవుతుంది. భోపాల్ పరిసర ప్రాంతమంతా వ్యాపిస్తుంది.

ఆ సమయంలో భోపాల్ ప్రజల పరిస్థితి ఏంటి? దానికి వారు ఎలా బలైపోయారు? భోపాల్ రైల్వే స్టేషన్ లో ఉన్న వారిని కాపాడేందుకు ఇమాద్, ఇఫ్తికర్ సిద్ధికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? రైల్వే జీఎం రతి పాండే (మాధవన్) చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.మానవ తప్పిదాలు కారణంగా చరిత్రపుటల్లో చీకటి అధ్యయనాలుగా మిగిలినవి చాలా ఉంటాయి.వాటిలో ఒకటి దుర్ఘటమైన సంఘటన భోపాల్ గ్యాస్ లీకేజీ. ఈ ఘటనలో దాదాపు 15 వేల మంది అమాయకులు బలైపోయారు. ఈ ఘోరాన్ని హృద్యంగా తరికెక్కించడంలో దర్శకుడు శివ రావైల్ సక్సెస్ అయ్యాడు. ఎక్కువ సమయం తీసుకోకుండా అసలు కథలోకి వెళ్లిపోయాడు. ఇమాద్ పాత్ర ద్వారా ఫ్యాక్టరీలో జరిగే భయంకర విషయాలు తెలియజేశాడు.

ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ పాత్రకు డీటెయిల్ ఇచ్చాడు. గ్యాస్ లీక్ అయితే ప్రజల పరిస్థితి ఏంటని ఉత్కంఠను క్రియేట్ చేశాడు. ఒకపక్క గ్యాస్ లీకేజీ మరోపక్క రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు,వారిని ఎలా కాపాడుతారు అంటూ నరాలు తెగే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ స్క్రీన్ ప్లే ను రేసీగా నడిపించారు. గ్యాస్ లీక్ అయిన తర్వాత భోపాల్ లో ఉన్న పరిస్థితులను చూపించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.సిద్ధికి పాత్రకి కేకే మీనన్ జీవం పోసాడు.

ఆయనను తప్ప పాత్రలలో వేరే వాళ్ళని ఊహించుకోలేం. ఇమాద్ పాత్రలో బాబిల్ ఖాన్ జీవించేసాడు. దివ్యేందు శర్మ కూడా ఆకట్టుకున్నాడు. రతి పాండే గా మాధవన్ ఇంటెన్సిటీతో నటించాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రకి న్యాయం చేశారు. టెక్నికల్ గా ఈ సీరీస్ కోసం పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. సామ్ సాట్లర్ సంగీతం ప్రాణం పోసింది. రూబెన్ సినిమాటోగ్రఫి సిరీస్ ను మరో స్థాయిలో నిలబెట్టింది.తప్పిస్తే ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ ను కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఆనాటి దుర్ఘటన ఎలా జరిగిందో కళ్ళకు కట్టారు.

 

Also Read:ఈ వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..! ఇలా ఆలోచించడం అవివేకం ఏమో..?


End of Article

You may also like