మీ నుదిటిపై ముడతలు పడుతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

మీ నుదిటిపై ముడతలు పడుతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

by Anudeep

Ads

చాలామందికి తమ అందం అంటే ఎంతో మక్కువ ఎక్కువ.. అసలు అందంపై దృష్టి పెట్టనివారు ఎవరు ఉంటారో చెప్పండి. 60 ఏళ్ళ వయస్సులో కూడా 20 ఏళ్ళు వయస్సు వారిలా కనిపించాలని కోరుకుంటారు. అయితే మన వయస్సు పెరుగుతుందనే విషయానికి నిదర్శనంగా మనం ముఖం పై ముడతలు ప్రారంభమవుతున్నాయి.

Video Advertisement

వయసు పెరిగే కొద్దీ మొదటిగా ముడతలు ఏర్పడే ప్రదేశం నుదురు. వాటినే ప్రీమెచ్యూర్ రింకిల్స్ అంటారు. ఇది చర్మం పలుచగా ఉన్న వారిలో త్వరగా మొదలవుతాయి. కొందరికి చిన్న వయసులోనే ఈ సమస్య ప్రారంభమవుతుంది. ఈ సమస్యను ఆడవారికన్నా మగవారిలో ఎక్కువగా ఉంటుంది.

forehead lines

మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ నివారణలను పాటించాల్సిందే..

#1. గుడ్డు :

Egg white

ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానిలో అరచెంచా నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో గాని, చల్లని నీటితో గాని  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది

#2. అరటిపండు :

Honey

బాగా పండిన అరటి పండును తీసుకుని గుజ్జులా చేసి ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కలబంద గుజ్జు  ఈ మూడింటిని బాగా కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

#3. ముల్తానీ మట్టి :

ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని తీసుకుని, మట్టిని క్రీమ్ లా కలుపుకోవడానికి సరిపడినంత రోజు వాటర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ కి అప్లై చేసి పూర్తిగా ఆరే వరకూ అలానే ఉండాలి. తర్వాత శుభ్రంగా చల్లని నీటితో కడుక్కోవాలి. సబ్బును ఏ మాత్రం ఉపయోగించకూడదు.

#4. ఆహార నియమాలు :

చర్మం మృదువుగా, కాంతిగా ముడతలు లేకుండా ఉండాలి అంటే చర్మానికి సహకరించే విటమిన్ సి  ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. జామ, బొప్పాయి, టమోటో,స్ట్రా బెర్రీ,  అవకాడో  వంటి పండ్లను ఆహారంలో జతచేసుకోవాలి.

#5. మెడిటేషన్:

నుదిటిపై ముడతలు పోవడానికి ఫేషియల్ ఎక్సర్సైజులు వంటివి చెయ్యాలి.

#6. నీరు :

మనిషి శరీరము యవ్వనంగా ఉండాలంటే మీరు ఎంతగానో సహాయపడుతుంది. రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు ఖచ్చితంగా తాగాలి. ఇది ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలోని వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఎప్పుడైతే మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుందో. మన చర్మం కూడా కాంతివంతంగా ముడుతలు లేకుండా తయారవుతుంది.


End of Article

You may also like