Ads
ఇటీవల జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో రిషబ్ పంత్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో పంత్ సెంచరీ ని కొట్టాడు. శ్రీలంకలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో కూడా 96 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు.
Video Advertisement
ఇవి కాక, రిషబ్ పంత్ తాజాగా మరో రికార్డుని కూడా సృష్టించాడు. పంత్ గురువైన మహేంద్ర సింగ్ ధోని వల్ల కూడా సాధ్యం కాని రికార్డుని పంత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇటీవల ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. కాగా, ఈ ర్యాంకింగ్స్ లో పంత్ తన సత్తా చాటాడు. టెస్ట్ బాటింగ్ ర్యాంకింగ్స్ లో పంత్ పదో స్థానానికి చేరుకున్నారు. రిషబ్ ఖాతాలో దాదాపు 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ రేటింగ్స్ తో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లోకి చేరిన మొదటి ఇండియన్ వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. గతంలో ఈ ర్యాంకింగ్స్ లో మాజీ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు టాప్ 10 లోపు ర్యాంకింగ్ తెచ్చుకోలేదు.
తాజాగా ధోనిని అధిగమించి మరీ పంత్ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. 763 రేటింగ్ తో కోహ్లీ ఐదవ స్థానంలోనూ, 761 రేటింగ్ తో రోహిత్ శర్మ ఆరవ స్థానంలో ఉండగా, 723 రేటింగ్ తో పంత్ పదో స్థానంలో ఉన్నారు. అలాగే.. టెస్ట్ బౌలర్లు ర్యాంకింగ్స్ లో కూడా టాప్ 10 లో ఇద్దరికీ చోటు దక్కింది. రవిచంద్రన్ అశ్విన్ రెండవ స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వ స్థానంలో ఉన్నాడు.
End of Article