ఇదెక్కడి వింత ఆచారం: అక్కడ సమాధి నుండి శవాన్ని తీసి…సంవత్సరీకం చేస్తారంట.?

ఇదెక్కడి వింత ఆచారం: అక్కడ సమాధి నుండి శవాన్ని తీసి…సంవత్సరీకం చేస్తారంట.?

by Anudeep

Ads

హైందవ సంప్రదాయాల్లో ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారాల్లో మార్పులు ఉంటాయి. ఎక్కడి ఆచారాలు అక్కడే ఉంటాయి. మరొకరికి వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

Video Advertisement

హిందువుల్లో చాలా మంది చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తారు. ప్రతి ఏడాది ఆ వ్యక్తి ఫోటో కు దండ వేసి సంవత్సరీకాలు నిర్వహిస్తారు. క్రిష్టియన్లలో సమాధిని దర్శించి..వాటిపై పువ్వులు చల్లుతారు. ప్రతి ఏడాది వారు మరణించిన రోజున చనిపోయిన వ్యక్తి కి ఇష్టమైన విధం గా గడుపుతారు. కానీ ఇండోనేషియా కు చెందిన రిందిగాల్లో అనే గ్రామంలో వ్యక్తులు మాత్రం చనిపోయిన వ్యక్తి శవాన్ని బయటకు తీసి సంవత్సరీకం చేస్తారు. ఇదే అక్కడి వారి ఆచారం.

ఈ గ్రామం లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తులని సమాధి చేసేస్తారు. ప్రతి సంవత్సరం అదే రోజున ఆ శవాన్ని బయటకు తీసి కెమికల్స్ తో శుభ్రం చేస్తారు. ఆ తరువాత ఆ వ్యక్తి వేసుకునే బట్టలను శుభ్రం గా తొడిగి ఇంటికి తీసుకుని వస్తారు. ఆ వ్యక్తి బతికి ఉన్నపుడు ఇంట్లో ఎలా కూర్చునేవాడో.. అలానే ఓ కుర్చీ వేసి కూర్చోబెడతారు.

ఆ రోజుని వేడుకగా చేస్తారు. ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకునే ఇంటి సభ్యులంతా భోజనాలు చేస్తారు. రాత్రి సమయం లో తీవ్ర విషాదం తో ఆ శవాన్ని తిరిగి యధాస్థానం లో పాతిపెట్టేస్తారు. ఆ రాత్రి మొత్తం చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటూ తెల్లవార్లూ మేలుకునే వుంటారు. వింతగా అనిపిస్తోంది కదూ.. కొన్ని ఆచారాలు అంతే. ఇవి ఎప్పుడో ఎవరో మొదలు పెడతారు.. అవి తరతరాలు గా అలా కంటిన్యూ అవుతూ వస్తుంటాయి.


End of Article

You may also like