ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి గర్వకారణమైన వ్యక్తి నీరజ్ చోప్రా. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. నీరజ్ చోప్రాని ఎంతోమంది ఇంటర్వ్యూ చేశారు. అందులో చాలా మంది, “తాను ఒలింపిక్స్ కు ఎలా ప్రిపేర్ అయ్యారు?” అని, “గేమ్ ఆడేటప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంది?” అని, అలాగే “గోల్డ్ మెడల్ విన్నర్ అయిన తర్వాత తనకి ఎలా అనిపించింది?” అని ఇలాంటి ప్రశ్నలు అడిగారు.

కానీ కొన్ని ఇంటర్వ్యూలలో మాత్రం చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి నీరజ్ చోప్రా కి మాత్రమే కాదు, చూసే ప్రేక్షకులు కూడా అసహనం తెప్పించేలా చేశారు. ఇటీవల నీరజ్ చోప్రా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి నీరజ్ చోప్రా కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అని అడిగారు. లేరు అంటే ఎందుకు లేరు అని అడిగి ఇబ్బంది పెట్టారు. ఇదే విధంగా, ఇటీవల నీరజ్ చోప్రా కి ఇంకొక ఘటన ఎదురయ్యింది.

watch video :

ముంబై రెడ్ ఎఫ్ఎమ్ ఆర్జె అయిన మలిష్కా ఇటీవల నీరజ్ చోప్రా ఇంటర్వ్యూ తీసుకున్నారు. మలిష్కా అడిగిన ప్రశ్నలకు వీడియో కాల్ ద్వారా నీరజ్ చోప్రా సమాధానం చెప్పారు. అయితే, వీడియో కాల్ లో నీరజ్ చోప్రా ముందు డాన్స్ వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మలిష్కా. ఆ తర్వాత ఇంటర్వ్యూ ముగిసే ముందు నీరజ్ చోప్రాని వీడియో కాల్ లోనే హగ్ అడిగారు.

ఇదంతా నీరజ్ చోప్రాకి ఇబ్బంది కలిగిస్తోంది అని అతన్ని చూస్తే అందరికీ అర్థమైపోతుంది. దాంతో, సోషల్ మీడియా అంతటా ఈ వీడియో వైరల్ అయ్యింది. “గోల్డ్ మెడల్ విన్నర్ తో ఇలాంటి ప్రవర్తన ఏంటి? అతనిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?” అని చాలా మంది నెటిజన్లతో పాటు, ప్రముఖులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

watch video :