బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అయిన అభిజిత్, బిగ్ బాస్ తర్వాత టీవీ ఛానల్స్ లో, అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూలలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం మాత్రమే కాకుండా బిగ్ బాస్ లో తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, తను ఎలా ఫీల్ అయ్యారు అనే వాటి గురించి కూడా అభిజిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

rohit sharma gift to bigg boss abijeet

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అభిజిత్. క్రిస్టమస్ రోజు శాంటా క్లాస్ లాగా వెళ్లి ఎంతోమందిని సర్ప్రైజ్ చేసారు అభిజిత్. ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆన్లైన్ లో తన ఫ్యాన్స్ తో మాట్లాడారు. అభిజిత్ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో రోహిత్ శర్మ జెర్సీ ఉంది.

rohit sharma gift to bigg boss abijeet

rohit sharma gift to bigg boss abijeet

దానిపై “విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్ అభిజిత్” అని ఒక నోట్ తో పాటు కింద రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. దీనిని హనుమ విహారి అభిజిత్ కి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని అభిజిత్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి, చిన్నప్పటినుంచి తనకి క్రికెటర్ అవ్వాలని ఉండేదని,

కానీ అది కుదరలేదు అని, ఇది తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని అన్నారు.  అంతే కాకుండా టీమిండియాకి సపోర్ట్ చేయమని కూడా చెప్పడంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అభిజిత్. అభిజిత్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE