“ఆ ఒక్క సినిమా వల్ల సంగీతాన్నే వదిలేసాను.!” అంటూ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం ఏంటో చెప్పిన ఆర్.పి.పట్నాయక్.!

“ఆ ఒక్క సినిమా వల్ల సంగీతాన్నే వదిలేసాను.!” అంటూ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం ఏంటో చెప్పిన ఆర్.పి.పట్నాయక్.!

by Mohana Priya

Ads

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్. మనసంతా నువ్వే, నువ్వు నేను, సంతోషం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి సూపర్ హిట్ పాటలను అందించారు ఆర్.పి.పట్నాయక్.

Video Advertisement

ఇప్పటికి కూడా మనం చాలా చోట్ల సంతోషం సినిమాలోని “నే తొలి సారిగా” పాట వింటూనే ఉంటాం. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకత్వం అందించడం మాత్రమే కాకుండా, కొన్ని సినిమాల్లో కూడా నటించారు. గత కొంత కాలం నుండి ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకత్వం అందించడం ఆపేశారు.

rp patnaik about quitting music direction

ఈ విషయంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, తాను మ్యూజిక్ డైరెక్షన్ ఆపేయడం వెనకాల కారణం ఏంటో చెప్పారు. 2004లో విడుదలైన నేనున్నాను చిత్రానికి సంగీత దర్శకత్వం అందించడానికి ముందుకు ఆర్పీ పట్నాయక్ ని అనుకున్నారు. రెండు పాటలకు ట్యూన్ కూడా అందించారు. ఆ తర్వాత యుఎస్ టూర్ కోసం ఆర్.పి.పట్నాయక్ సినిమా మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్లారు. ఈ విషయాన్ని నిర్మాతలకు ముందుగానే చెప్పారు. అయినా కూడా సినిమాలు మధ్యలో వదిలేసి అలా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్లిపోవడం వాళ్ళకి నచ్చలేదు.rp patnaik about quitting music direction

దాంతో ఆయన యుఎస్ టూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేనున్నాను సినిమా మార్కెట్ కి సంగీత దర్శకుడి వల్ల నష్టం జరుగుతుంది అని నిర్మాతలు అన్నారు. పరిశ్రమకు బలంగా ఉండే నిర్మాతలకి తన వల్ల నష్టం జరగడం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆర్.పి.పట్నాయక్ పూర్తిగా సంగీతాన్ని వదిలేశాను అన్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం కూడా యుఎస్ టూర్ లో ఉండడం వల్ల మిస్సయింది అని అన్నారు. నేనున్నాను సినిమా నుండి తప్పుకున్న తర్వాత తన మ్యూజిక్ ని ఇష్టపడే కొంతమంది దర్శకులు వారి సినిమాలకు మ్యూజిక్ చేయడానికి ఒప్పించారు అని చెప్పారు ఆర్.పి.పట్నాయక్.


End of Article

You may also like