ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఐదు నెలల తరువాత సొంత ఊరిలోనే దారుణం.. అసలేమైందంటే..?

ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఐదు నెలల తరువాత సొంత ఊరిలోనే దారుణం.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

కులం కారణంగా ప్రేమ వివాహాలను పెద్దలు వ్యతిరేకించడం అనాదిగా వస్తున్నదే. మరోవైపు ప్రేమ పెళ్లిళ్లు కూడా ఎక్కువకాలం సవ్యంగా సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హుణసూరు తాలూకాలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గాభరా కలిగిస్తోంది.

Video Advertisement

హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి ఊరికి చెందిన రాకేష్, అర్చన అని ఇద్దరు యువ జంట గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీరిద్దరూ కులాలు వేరే కావడంతో వీరిద్దరిని పెళ్లి చేసుకోవడానికి వీరి కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదు.

దీనితో వీరు తమ ప్రేమ కోసం పెద్దలని ఎదిరించారు. ఐదు నెలల క్రితమే వీరు పెద్దలని కాదని ఇంటినుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అయిదు నెలల క్రితమే వీరు మైసూర్ లో కాపురం పెట్టారు. అయితే, ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఈ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనితో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఇలా ఉంటె.. మరో వైపు వీరి తల్లి తండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదు అంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.

ఏమి జరిగిందో తెలియదు కానీ, అర్చనా రాకేష్ లు మంగళవారం రాత్రికి సింగరమారనహళ్లి ఊరికి వచ్చేసారు. తెల్లారేసరికి వీరిద్దరూ విగత జీవులుగా ఊరి పొలిమేరల్లో చెట్టుకు వేళ్ళాడుతూ కనిపించారు. వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో బిళికెరె ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.


End of Article

You may also like