Ads
క్షణికావేశాలలో చేసే పనులు ఎంతటి అనర్ధాలను తీసుకొస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల మతం మార్చుకోని కారణంగా ఈ అమ్మాయిని కొందరు వ్యక్తులు దారుణంగా తుపాకీ తో కాల్చి చంపారు. ఈ దుర్ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Video Advertisement
పాకిస్థాన్ లో మైనారిటీలకు రక్షణ లేదు అన్న విషయం వాస్తవమే. హిందూ, క్రిష్టియన్ మతస్తులను బలవంతంగా ముస్లింగా మారుస్తుంటారు. అలా ఒప్పుకొని వారిని సమయం చూసి హత్య చేస్తూ ఉంటారు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కు చెందిన పూజా అనే హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలని దుండగుడు భావించాడు. అయితే.. పూజా మతం మార్చుకోవడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. దీనితో ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా మార్పించాలనుకున్నారు. అయితే.. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆమెను నడిరోడ్డుపైనే తుపాకీతో దారుణంగా కాల్చేశారు.
ఈ కాల్పులతో తీవ్ర గాయాలపాలు అయిన పూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పూజా మృతి తో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. పాకిస్థాన్ లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. సింధ్ ప్రాంతంలో హిందూ మైనారిటీ కి చెందిన మహిళలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. అక్కడి మహిళలు బలవంతపు వివాహాలు, మతమార్పిడులు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు.
పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలో హిందూ జనాభా 6.51 శాతంగా ఉంది. వీరు తరచుగా మాత మార్పిడిల విషయమై వేధింపులకు గురి అయినట్లు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలు బలవంతపు మతమార్పిడులు, వివాహాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
End of Article