కట్నం కింద 47 లక్షలిచ్చారు.. అయినా ఈ అమ్మాయి అత్తింటివారు ఎంతటి దారుణానికి ఒడిగట్టారంటే..?

కట్నం కింద 47 లక్షలిచ్చారు.. అయినా ఈ అమ్మాయి అత్తింటివారు ఎంతటి దారుణానికి ఒడిగట్టారంటే..?

by Anudeep

Ads

కాలం మారుతున్న… రోజులెన్ని గడుస్తున్నా.. ఆడవారికి వరకట్న వేధింపుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. సొంత కుటుంబాన్ని వదులుకుని అత్తింటికి వెళ్లే అమ్మాయిలు తీరని కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నేటికీ కొనసాగుతోంది.

Video Advertisement

తాజాగా ఇటువంటి దుర్ఘటనే కడప చింతకొమ్మదిన్నై మండలంలో బృందావన్ కాలనీలో చోటు చేసుకుంది. పెళ్ళైన ఎనిమిది నెలలకే ఓ వివాహిత అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది.

navitha

ఎస్సై మంజునాధ రెడ్డి ఇచ్చిన వివరాల మేరకు.. సింహాద్రిపురం మండలం గూడూరుకు చెందిన లక్ష్మి నారాయణ రెడ్డి కుమార్తె నవిత (25) ఎంబీఏ చదువుకున్నారు. ఆమె ఓ కంపెనీలో పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. కాగా.. ఆమెకు 2021 ఆగష్టులో బృందావన్ కాలనీకి చెందిన గుగ్గుళ్ల బాబా రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్ళిలో కట్న కానుకల కింద వారికి 47 లక్షల రూపాయల నగదును కూడా చెల్లించారు.

navitha 1

పెళ్ళైన కొంత కాలం వరకు బాగానే గడిచింది. తాజాగా.. కొంత కాలం నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు వేధించడం మొదలు పెట్టారు. ఇటీవల అత్తమామల నుంచి మాత్రమే కాకుండా భర్త నుంచి కూడా వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులను తట్టుకోలేక గత గురువారం నవిత ఆమె తల్లితండ్రులతో చివరిసారిగా మాట్లాడారు. ఆ తరువాత ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకి భర్త, అత్తమామల వేధింపులే కారణమని నవిత తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు వరకట్న కేసు నమోదు చేసారు.


End of Article

You may also like