ఈ “సలార్” నటి “పొగరు”లో విలన్ అని మాత్రమే తెలుసు..కానీ ఆ క్రికెటర్ కూతురని తెలీదు అనుకుంట.?

ఈ “సలార్” నటి “పొగరు”లో విలన్ అని మాత్రమే తెలుసు..కానీ ఆ క్రికెటర్ కూతురని తెలీదు అనుకుంట.?

by Mohana Priya

Ads

కొంత మంది చాలా పాత్రల్లో నటిస్తారు. కానీ అంత గుర్తు పెట్టుకునే పాత్రలు ఎక్కువగా ఉండవు. కొంత మంది తక్కువ సినిమాల్లో నటించినా కూడా, ప్రతి పాత్ర గుర్తు పెట్టుకునే విధంగానే ఉంటుంది.

Video Advertisement

అలా ఇటీవల చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో, నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి శ్రీయా రెడ్డి. సలార్ సినిమాలో రాధా రమ అనే పాత్రలో శ్రీయా రెడ్డి నటించారు. సినిమా మొత్తంలో ఒక హైలైట్ గా నిలిచారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే చాలా మంది శ్రీయా రెడ్డి తమిళ్ కుటుంబానికి చెందినవారు అని అనుకుంటారు. కానీ కాదు. శ్రీయా రెడ్డి తెలుగు కుటుంబానికి చెందినవారు. శ్రీయా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి ఒక క్రికెటర్ 1978 నుండి 1981 వరకు ఇండియన్ టీంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. గుడ్ షెఫర్డ్ హైస్కూల్లో చదువుకున్న శ్రీయా రెడ్డి, తర్వాత చెన్నైలో ఉన్న ఎతిరాజ్ కాలేజ్ లో చదువుకున్నారు.

salaar sriya reddy father

బాలాజీ శక్తి దర్శకత్వంలో, వచ్చిన విక్రమ్ హీరోగా నటించిన సమురాయ్ సినిమాలో ఒక సహాయ పాత్రలో నటించారు. ఇది శ్రీయా రెడ్డి మొదటి సినిమా. తెలుగులో శ్రీయా రెడ్డి అప్పుడప్పుడు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాతో శ్రీయా రెడ్డికి తమిళ్ తో పాటు, తెలుగులో కూడా చాలా మంచి పేరు వచ్చింది. 2008 లో శ్రీయా రెడ్డి విశాల్ అన్న అయిన విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు.

శ్రీయా రెడ్డి గత సంవత్సరం వరకు కూడా అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చారు. సుడల్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ లో కూడా చాలా మంచి పాత్రలో నటించారు. ఇప్పుడు మళ్లీ సలార్, ఆ తర్వాత ఓజీ సినిమాల్లో నటిస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యం ఉంటేనే సినిమాల్లో చేయడానికి అంగీకరిస్తాను అని శ్రీయా రెడ్డి చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు. చెప్పినట్టుగానే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు, తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే శ్రీయా రెడ్డి చేస్తున్నారు.

ALSO READ : సలార్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా..? ఈ సీన్ చూస్తే ప్రశాంత్ నీల్ కూడా షాక్ అవుతారు ఏమో..!


End of Article

You may also like