Ads
టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం చాలామంది కల. ఎందుకంటే అక్కడ జీతాలు ఎక్కువగా ఉంటాయి.. అలాగే వనరులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే అవే కంపెనీల్లోని మెయిన్ పార్ట్ అయిన సీఈఓ లకు (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా జీతాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అయితే కరోనా తర్వాత కూడా వారి జీతాల్లో పెరుగుదల కనిపించిందని నిపుణులు వెల్లడించారు.
Video Advertisement
కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయినా.. ఐటీ రంగం దాన్ని తట్టుకొని నిలబడింది. ఈ నేపథ్యం లో ప్రస్తుతం దేశంలోని టాప్ టెక్ కంపెనీ సీఈఓల్లో ఎవరు ఎక్కువ జీతం తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
#1 విజయకుమార్ – హెచ్‌సీఎల్
దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిలిచారు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్. 2021లో విజయకుమార్ రూ.123.13 కోట్ల (16.52 మిలియన్ డాలర్లు) వేతనం పొందారు.
#2 థియరీ డెలాపోర్ట్ – విప్రో
విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్ట్ 2021-22లో వార్షిక వేతనంగా 10.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.80 కోట్లు. 2020 జులైలో ఆయన కంపెనీ సీఈఓ గా నియమితులయ్యారు.
#3 సలీల్ పరేఖ్ – ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.71.02 కోట్లు జీతంగా అందుకున్నారు. పరేఖ్ పదవీకాలాన్ని 2027 వరకు, అంటే ఐదేళ్లపాటు పొడిగించే ప్రతిపాదనను ఆమోదించారు. ఆయన ప్యాకేజీని రూ.79.75 కోట్లకు పెంచారు.
#4 సీపీ గుర్నానీ – టెక్ మహీంద్రా
టెక్ మహీంద్రా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ 2021-22 మధ్య కాలంలో రూ.63.4 కోట్లు వేతనంగా పొందారు.
#5 రాజేష్ గోపీనాథన్ – టీసీఎస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ అండ్ ఎండీ రాజేష్ గోపీనాథన్. 2021-22 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.25.75 కోట్ల రెమ్యునరేషన్ ఆయన చేతికి వచ్చింది.
#6 ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం – ఎల్ & టి
ఎల్ & టి సీఈఓ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం గత ఆర్థిక సంవత్సరం లో 59 కోట్ల వేతనం అందుకున్నారు.
#7 కళానిధి మారన్ – సన్ గ్రూప్స్
సన్ గ్రూప్స్ అధినేత, సీఈఓ కళానిధి మారన్ ఏడాదికి 77 కోట్ల వేతనం పొందుతున్నారు.
#8 గోపాల్ విట్టల్ – భారతి ఎయిర్టెల్
ఇండియా లోనే అతిపెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటైన భారతి ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ ఏడాదికి 169 కోట్లు ఆర్జిస్తున్నారు.
#9 పవన్ ముంజల్ – హీరో మోటోకార్ప్
మోటారుసైకిల్స్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్ సీఈఓ పవన్ ముంజల్. ఈయన ఏడాదికి 60 కోట్ల వేతనం అందుకుంటున్నారు.
#10 రాహుల్ బజాజ్ – బజాజ్ ఆటో
బజాజ్ ఆటో సీఈఓ రాహుల్ బజాజ్ ఏడాదికి 32 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
End of Article