ఐపీఎల్ లో ఉండే అంపైర్ లకు సాలరీస్ ఎంత ఉంటాయో తెలుసా..? వారికి డబ్బులు ఎవరు చెల్లిస్తారు..?

ఐపీఎల్ లో ఉండే అంపైర్ లకు సాలరీస్ ఎంత ఉంటాయో తెలుసా..? వారికి డబ్బులు ఎవరు చెల్లిస్తారు..?

by Anudeep

Ads

“ఐపీఎల్”.. ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతగానో ఎదురుచూసేది ఐపీఎల్ కోసమే… భారత ఆటగాళ్ల సత్తా రుజువయ్యేది ఈ ఐపీఎల్ తోనే.. అతిపెద్ద క్రికెట్ కుంభమేళా గా ఐపీఎల్ కు పేరుంది. ప్రపంచవ్యాప్తం గా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడటానికి మొగ్గుచూపుతుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ హడావిడి మొదలైంది. గతేడాది ఆలస్యం గా జరిగింది. అది కూడా పరాయి గడ్డ అయినా యుఏఐ లో జరిగింది. ఈసారి మన దేశం లోనే జరుగుతున్నా టివీల్లోనే చూడాల్సి వస్తోంది.

Video Advertisement

ipl 2021

సరే, ఆటను ఎలా అయినా మనం ఎంజాయ్ చేస్తాం.. కానీ.. ఐపీఎల్ చూసే వారికీ సాధారణం గా వచ్చే డౌట్ అంపైర్ల గురించి. అసలు వారికి సాలరీస్ ఎంత వస్తాయో.. ఎవరు ఇస్తారు..? అన్న సందేహాలు చాలా మందికే ఉండి ఉంటాయి. వాటికి ఆన్సర్స్ ఇప్పుడు చర్చిద్దాం. గతేడాది ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేసిన అంపైర్ లు అనిల్ చౌదరి, సి. షంషుద్దీన్, వీరేందర్ శర్మ, కె.ఎన్. అనంతపద్మనాభన్, నితిన్ మీనన్, ఎస్. రవి, వినీత్ కులకర్ణి, యశ్వంత్ బార్డే, ఉల్హాస్ గాంధే, అనిల్ దండేకర్, కె. శ్రీనివాసన్, పశ్చిమ్ పాఠక్.

umpire 3

ఈ ఏడాది కూడా వీరు కొనసాగనున్నారు. అంపైర్ లు కూడా ప్లేయర్స్ లాగానే, మ్యాచ్ లో పాల్గొనే ముందు పరీక్ష చేయించుకోవడం, క్వారంటైన్ లో ఉండటం తప్పనిసరి. ఫారిన్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా), క్రిస్టోఫర్ గఫానీ (న్యూజిలాండ్). ఈ సంవత్సరం ఐపీఎల్ అంపైర్లని పేటీఎం స్పాన్సర్ చేస్తున్నారు.

umpire 4

టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్లకి 7,33,000 రూపాయలు ఇస్తారు. ఎలైట్ ప్యానెల్ అంపైర్లకి మ్యాచ్ కి 1,98,000 రూపాయలు, డెవలప్మెంట్ అంపైర్లకి ఒక మ్యాచ్ కి 59,000 రూపాయలు అందుతాయి.

umpire 5

అనిల్ చౌదరి, సి. షంషుద్దీన్, నితిన్ మీనన్, ఎస్. రవి, వినీత్ కులకర్ణి, ఉల్హాస్ గాంధే, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రీఫెల్, క్రిస్టోఫర్ గఫానీ ఎలైట్ అంపైర్ల జాబితాలోకి వస్తారు. వీరేందర్ శర్మ, కె. ఎన్. అనంతపద్మనాభన్, యశ్వంత్ బార్డే, అనిల్ దండేకర్, కె.శ్రీనివాసన్, పశ్చిమ్ పాఠక్ డెవలప్మెంట్ అంపైర్ల జాబితాలోకి వస్తారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్‌ లో ఉన్న నాలుగవ అధికారి నితీష్ మీనన్.

 


End of Article

You may also like