బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తోంది. తొలి రోజు సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుంచి జెట్ స్పీడ్‌తో కలెక్షన్లు సాధిస్తున్నది. కాటమ రాయుడు, వీరమ్ చిత్రాలకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కించారు.

Video Advertisement

 

 

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా కి ప్లాప్ టాక్ వస్తే ఆ సినిమా తేరుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి. కానీ డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళని రాబట్టడం కొందరికే చెల్లుతుంది. వారిలో ఒకరే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. రంజాన్ కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కి ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ వచ్చింది.

salman khan's kisi ki bhai kisi ki jaan movie collections..!!

రంజాన్ పండగ వీకెండ్ లో ఎలాగోలా యావరేజ్ రేంజ్ వసూళ్ళని అందుకున్న సినిమా తర్వాత స్లో డౌన్ అయిపొయింది. కానీ అనుకోని విధంగా 11 వ రోజుకి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ మూవీ. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. అలాగే పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, అలాగే వదినగా భూమిక నటించారు. ఈ సినిమా పేరుకి రీమేక్ అయిన కూడా బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు.

salman khan's kisi ki bhai kisi ki jaan movie collections..!!

ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా ఒక పాత లో కనిపించారు. సల్మాన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నా కూడా మినిమమ్ వసూళ్లు ఈ రేంజ్ లో ఉంటాయి అన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గానే నిలిచింది అని చెప్పాలి.

Aslo read: సల్మాన్ ఖాన్ “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” (కాటమరాయుడు రీమేక్) ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?