కరోనాకి ఫస్ట్ బర్త్ డే అంటూ ట్రెండ్ అవుతున్న 18 ట్రోల్ల్స్…ముందే తెలిస్తే బ్యాట్ సూప్.?

కరోనాకి ఫస్ట్ బర్త్ డే అంటూ ట్రెండ్ అవుతున్న 18 ట్రోల్ల్స్…ముందే తెలిస్తే బ్యాట్ సూప్.?

by Mohana Priya

Ads

అసలు మనకి తెలియకుండానే 2020 చివరికి వచ్చేసింది. ఇలా ఒక సంవత్సరంలో మాక్సిమమ్ సమయం ఇంట్లోనే గడపడం ఇదే మొదటి సారి ఏమో. పనులు అన్నీ ఆగిపోయాయి. ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ని వాయిదా వేసుకోవలసి వచ్చింది. మానసిక ఇబ్బందులు కూడా ఎక్కువ అయ్యాయి. ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి బయటికి వెళ్దాం అనుకున్నా కూడా ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ధైర్యం చేసి బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కావట్లేదు.

Video Advertisement

ఇలాంటి సమయంలో అసలు బయటికి వెళ్ళలేక, ఎక్కువ సేపు ఇంట్లో ఉండలేక, మానసిక ఇబ్బందులతో, ఆర్ధిక ఇబ్బందులతో చాలా గందగోళంగా తయారైంది ప్రపంచం. అసలు మాస్క్ ఎప్పుడో దుమ్ములో వెళితే తప్ప వేసుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు బయట ఎలా ఉన్నా కానీ మనం మాత్రం మాస్క్ కచ్చితంగా ధరించాల్సి వస్తోంది. శానిటైజర్ కూడా బయటికి వెళ్లినప్పుడు తీసుకొని వెళ్లేవాళ్లం. ఇప్పుడు రోజులో ఎన్నోసార్లు శానిటైజర్ వాడుతున్నాం.

బయటికి వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేసే ఫోన్, తాళాలు, లేదా ఇంకేమైనా ముఖ్యమైన వస్తువులతో పాటు మాస్క్, శానిటైజర్ కూడా ఒక భాగమైపోయాయి. ఇంక ఆన్లైన్ డెలివరీ ద్వారా వచ్చిన ఆర్డర్స్ కూడా చాలా మంది శానిటైజ్ చేస్తేనే తప్ప ముట్టుకోవటం లేదు. తినే పదార్థాల విషయంలో మామూలుగానే అందరం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఓసిడి (అబ్సెసివ్ క్లీనింగ్ డిసార్డర్) వచ్చేసింది.

ఇదంతా దేని వల్ల మొదలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  వీటన్నిటికీ కారణం కరోనా. ఇందాక పైన చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో దాదాపు చాలా సమయం మనం ఇంట్లోనే ఉన్నాం. 2020 ఎలా గడిచిపోయిందో ఎవరికీ అర్థం కావట్లేదు. కరోనా కేసులు మొదలయ్యి ఇవాళ్టితో సంవత్సరం అయ్యింది. అసలు కరోనా లేకపోతే ఎలా ఉండేవాళ్ళం అని అనుకుంటూ, అలాగే ఎక్కడో చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన కరోనా పుట్టినరోజు సందర్భాన్ని గుర్తు చేసుకుంటోంది సోషల్ మీడియా.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18


End of Article

You may also like