సంకటహర చతుర్థి కి ఎందుకంత ప్రత్యేకత? ఆరోజు వ్రతం ఎలా చేస్తే మంచిది..?

సంకటహర చతుర్థి కి ఎందుకంత ప్రత్యేకత? ఆరోజు వ్రతం ఎలా చేస్తే మంచిది..?

by Anudeep

Ads

వినాయకుడు జన్మించిన తిధి చతుర్థి. అందుకే ఆయనకు ఆ తిధి అంటే ఇష్టమని చెబుతుంటారు. ఆ తిధి రోజున వినాయకుడిని పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఐతే.. సంకటహర చతుర్థికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. సంకట అంటే కష్టాలు.. హర అంటే తొలగించడం అని అర్ధం. కష్టాలను తొలగించే చతుర్థి తిధి రోజుని “సంకట హర చతుర్థి” అని పిలుస్తారు.

Video Advertisement

ప్రతి మాసం లో పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకట హర చతుర్థి గా పరిగణిస్తారు. శ్రావణమాసం లో వచ్చే సంకటహర చతుర్థి కి మరింత విశేషం ఉంది. సాధారణం గానే శ్రావణమాసం అంటే నోములు.. పూజలు.. వ్రతాలతో సందడి గా ఉంటుంది. ఈ మాసం లో వచ్చే సంకటహర చతుర్థి రోజున అన్ని వినాయక దేవాలయాల్లోనూ విశేషమైన పూజలు జరిపిస్తూ ఉంటారు. వినాయకుడికి ఇష్టమైన చతుర్థి తిధులు నెలలో రెండుసార్లు వస్తాయి.

vinayaka 1

అమావాస్య తరువాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని.. పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. అయితే ప్రదోష కాల (సూర్యాస్తమయ) సమయం లో చతుర్థి తిధి ఉంటేనే ఆరోజు లెక్కలోకి వస్తుంది. వరుస గా రెండు రోజులు ఎప్పుడు ఇలా ఉండదు. ఒకవేళ రెండు ప్రదోష కాలాల్లో చతుర్థి తిధి ఉంటె.. రెండవ రోజునే సంకట హర చతుర్థి గా పరిగణించాలి.

vinayaka 2

ఈరోజు చాలా మంది భక్తులు శ్రద్ధతో వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాల్సి ఉంటుంది. వ్రతం చేసుకోవాలనుకునే వారు ఉదయం తెల్లవారుజామునే లేచి.. తలస్నానం చేసి గణపతిని పూజిస్తారు. కనీసం అరామీటరు ఉన్న తెలుపు లేదా ఎరుపు క్లాత్ ను తీసుకుని దానిని విఘ్నేశ్వరుని ముందు ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అందులో మూడు గుప్పిళ్ళ బియ్యము, తమలపాకు, వక్క, రెండు ఖర్జురాలతో తాంబూలం పెట్టి.. మనసులో కోరిక తలుచుకుంటూ ముడుపు కట్టాలి.

vinayaka 3

పూజ పూర్తి అయ్యాక సంకట నాశన గణేశా స్తోత్రం, సంకట హర చతుర్థి కథను చదువుతారు. ఆ ముడుపును స్వామి ముందే ఉంచాలి. ధూపం, దీపం, టెంకాయ కొట్టడం ఇత్యాది సేవలు చేస్తారు. ఆ తరువాత గణపతి ఆలయానికి వెళ్లి స్వామి వారికి 3 , లేదా 11 , లేదా 21 చొప్పున ప్రదక్షిణాలు చేస్తారు. శక్తికొలది గణపతికి గరిక ను సమర్పిస్తారు. నైవేద్యం పెట్టాలి. సూర్యాస్తమయం అయ్యే వరకు గణపతిని కదిలించకూడదు. సూర్యాస్తమయం అయ్యాక మరోమారు స్నానం చేసి.. పూజ చేసుకుని ఉద్వాసన చెప్పవచ్చు. ఇలా ఎన్ని నెలలు అనుకుంటే.. అన్ని నెలలు చేయాలి. నియమం పూర్తయ్యాక.. వినాయకుడికి కట్టిన ముడుపులోని బియ్యం తో పొంగల్ ను నైవేద్యం గా చేసుకుని తినాలి.


End of Article

You may also like