టీవీల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.

Video Advertisement

ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది. అయితే కొన్ని సార్లు మాత్రం ఒక్కోసారి సీరియల్ వాళ్ళు చేసే అతి చూస్తే నవ్వు ఆగదు. అసలు ఎందుకు అలాంటి సన్నివేశాలను చేస్తారో వాళ్ళ కైనా అర్థమవుతుందా అనిపిస్తుంది.

అయితే ఈ మధ్య కొన్ని సీరియల్స్ లో కొన్ని సన్నివేశాలు ఇష్టారీతిన తీస్తూ ట్రోల్స్ కి గురవుతున్నారు మేకర్స్. ఈ మద్య కాలం లో సీరియల్స్ ని లాజిక్స్ కి దూరంగా.. తెలివి లేకుండా తీస్తున్నారు. వీటిని చూస్తున్న నెటిజన్లు వాటిని ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చాలా సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

funny scene from tamil serial goes viral..!!

తాజాగా ఒక తమిళ సీరియల్ కి సంబంధించిన సీన్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకు ముందు ఇటువంటి వాటిని జనాలు పట్టించుకొనే వారు కాదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాభవం పెరగడం తో ఇటువంటి సీన్ల పై ట్రోల్స్ పెరుగుతున్నాయి. తమిళం లో సన్ టీవీ లో అన్బే వా అనే సీరియల్ 2020 నుంచి ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ లో డెల్నా డేవిస్, విరాట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

funny scene from tamil serial goes viral..!!

ఈ సీరియల్ లో తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో హీరోయిన్ భూమిక మేడపై నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడకు వచ్చిన ఆమె ఆడపడుచు వాసుకి ఎవరు చూడకుండా ఆమెపై కి ఒక దిండు విసురుతుంది. అప్పుడు భూమిక ఆ దిండు తగిలి.. ఫోన్ జారవిడిచి.. కళ్ళు తిరిగి మేడ పై నుంచి పడిపోబోతుంది. అప్పుడు వరుణ్ వచ్చి ఆమెను కాపాడతాడు. దీంతో ఈ సీన్ చూసిన నెటిజన్లు.. ‘బాబోయ్.. దిండు తగిలితే ఇంత రియాక్షన్ ఇవ్వాలా..’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :