హౌస్ వైఫ్ గా ఇంట్లో ప్రతి అమ్మ పరిస్థితి ఇంతే అనుకుంట.? కనెక్ట్ అయ్యే 90’s లో ఎమోషనల్ సీన్.!

హౌస్ వైఫ్ గా ఇంట్లో ప్రతి అమ్మ పరిస్థితి ఇంతే అనుకుంట.? కనెక్ట్ అయ్యే 90’s లో ఎమోషనల్ సీన్.!

by kavitha

Ads

కొన్ని చిత్రాలను చూస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకున్న భావన కలుగుతుంది. ముఖ్యంగా ఓ మూవీని మధ్యతరగతి జీవితాల కథతో సహజంగా, ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తే విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి కుటుంబ జీవితాల పై ఎన్నో చిత్రాలు వచ్చాయి.

Video Advertisement

తాజాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో 90’s (నైంటీస్) వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. 90లలోని మధ్య తరగతి కుటుంబంలోని సున్నితమైన భావోద్వేగాలను చక్కగా తెరకెక్కించారు. భర్త, పిల్లల కోసం భార్య పడే ఆరాటం, ఓ సన్నివేశంలో ఆమె చెప్పే డైలాగ్స్ ప్రతి హౌజ్ వైఫ్ కి కనెక్ట్ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ, ఫేమ్ వాసుకీ ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ 90’s’. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా, రాజశేఖర్ మేడారం నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ జనవరి 5 నుండి ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో నాటి వాసుకీ మధ్య తరగతి గృహిణి రాణిగా సహజంగా నటించింది. ఆమె కాకుండా ఆ పాత్రే కనిపించేలా నటనలో ఒదిగిపోయారు.
ఆమెను చూస్తే 90ల పిలల్లకు వారి తల్లి జ్ఞాపకం వస్తుంది. భర్తతో ఆర్ధిక ప్రణాళిక, వారి ఇంట్లో పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు ప్రతి గృహినికి తమను చూసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ముఖ్యంగా తాను చేసే పనుల గురించి చెప్పే సీన్ అయితే ప్రతి హౌజ్ వైఫ్ కి కనెక్ట్ అవుతుంది. ఆ సీన్ లో “పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి పోతావు. మళ్ళీ కబోర్డ్ లోకి ఎలా వస్తుంది. నేను ఉతుకుతున్నాను. అందరు బాత్రూమ్ వాడుతారు. శుభ్రంగా ఉంటున్నాయా? ఏయవరు క్లీన్ చేస్తున్నారు. నేను చేస్తున్నాను. పల్లాల్లో అందరు తినేసి ప్లేట్లు పడేసి పోతారు. మొత్తం కడిగి నేను నీట్ గా పెడుతున్నాను. వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను. గిన్నెలు తోముతున్నాను, ఇల్లంతా శుభ్రంగా పెడుతున్నాను.
అయినా ఎవరు నీళ్ళు అని ఎక్కడి నుండి కేకేసినా, నేనే నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. మీకు ఏం తక్కువ చేసిన, పక్కింటిలో ఉండేవారందరు, ఆడవాళ్ళు టివి సీరియల్స్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి, కేబుల్ కనెక్షన్ కూడా పీకేసావు. నాకు టివి కూడా లేదు. మీరందరు ఇంటికెప్పుడు వస్తారని కూర్చుని, ఎదురుచూస్తుంటాను. మీకాంతా అర్ధం కాదు. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు. కానీ అవి లేకుంటే రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ, పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుంటే మీకు లైఫే లేదు.” వంటి డైలాగ్స్ చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతాయి.

https://www.instagram.com/p/C1v1Qf7p2gb/

Also Read: 90’S REVIEW : శివాజీ నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like