ఏ నెగిటివ్ టాక్ కూడా సినిమాని ఆపలేకపోయిందిగా..? షారుక్ ఖాన్ “పఠాన్” ఇండియా వైడ్ కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏ నెగిటివ్ టాక్ కూడా సినిమాని ఆపలేకపోయిందిగా..? షారుక్ ఖాన్ “పఠాన్” ఇండియా వైడ్ కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anudeep

Ads

గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. అయితే మధ్యలో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు.

Video Advertisement

ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మంచి అంచనాల నడుమ జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా 7700 స్క్రీన్స్’లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది. ‘పఠాన్’ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 55 కోట్ల రేంజ్‌లో నెట్ కలెక్షన్స్‌ను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది.

pathaan movie review

ఈ సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే రికార్డుల నుండి వీకెండ్, వీక్ అండ్ లైఫ్ టైం ఇలా అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. ఇలా 13 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 438 కోట్లు నెట్‌, రూ. 849 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది. 14వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 15 – 16 కోట్లు గ్రాస్, రూ. 7 – 8 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

pathaan movie review

అలాగే ఈ మూవీ 2 వారాల్లో ఓవర్సీస్‌లో 41 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక, నార్త్ అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉన్న 14.33 మిలియన్ డాలర్ల రికార్డును ఇది బ్రేక్ చేసేసింది. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ “ఓ టి టి” హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది.


End of Article

You may also like