Ads
జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనది. జాతకంలో శనిదేవుడు అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. ఈ శని పీడ ప్రభావం చాలా కాలంపాటు ఉంటుంది. నవ గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ఇదే. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లేందుకు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. అంటే ఒక రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శని త్వరలోనే రాశిని మార్చుతుంది.
Video Advertisement
వచ్చే సంవత్సరం జనవరి 17న సాయంత్రం 05:04 గంటలకు శని దేవుడు రాశిని మార్చుతాడు. మకర రాశిని వదిలి తన సొంత రాశి కుంభంలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశిలో 30 ఏళ్ల తర్వాత శని దేవుడు సంచరించనున్నాడు. ఈ పరిణామం వల్ల కొన్ని రాశులపై శని అనుగ్రహం ఉంటుంది. తద్వారా వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మబోతున్నాయి.
శని గ్రహాన్ని న్యాయ దేవుడిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో శని శుభప్రదంగా ఉనప్పుడు వారికి అంతా మంచే జరుగుతుంది. లేదంటే కష్టాల తప్పవని జ్యోతిష్యులు చెబుతుంటారు. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇప్పడు వచ్చే ఏడాది నుంచి ఏ రాశులకు బావుంటుందో చూద్దాం..
#1 వృషభం – 2023లో వృషభ రాశి వారిపై శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. మీ జాతక చక్రంలోని 10వ ఇంట్లో శని సంచారం వల్ల.. జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలను పొందుతారు.
#2 మిథునం – మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో శని దేవుడి అనుగ్రహంతో మీ అదృష్టం మరింత పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
#3 మకరం – శనిగ్రహ రాశి పరివర్తనం మకర రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. మీ జాతక చక్రంలోని రెండో గృహంలో శనిదేవుడు సంచరిస్తాడు. ఇది సంపదకు సంబంధించినది. అందువల్ల మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు దగ్గ ఫలితాలు వస్తాయి.
కుంభరాశిలో శని సంచారం వల్ల మూడు రాశులవారు అనేక కష్టాలను ఎదుర్కోనున్నారు. అవి మేషం, సింహం, ధనుస్సు రాశులు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు కొన్ని చర్యలు తీసుకోవాలి. దానం చేయడం, శని చాలీసా పఠించడం, ఆవాల నూనె దీపం వెలిగించడం వంటి పనులు చేయండి.
End of Article