Ads
ప్రపంచ కుబేరుల స్థానం లో చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. లక్షల కోట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి అధిపతి.. ఆయన వ్యాపారాలు దేశంలోని ప్రతి మూల నుంచి విదేశాలకు విస్తరించాయి. అత్యంత ధనవంతుల కుటుంబం అయిన అంబానీ కుటుంబం చాలా విలాసవంతంగా జీవిస్తారు.
Video Advertisement
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులను వీరు రోజువారీగా ఉపయోగిస్తుంటారు. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ, కొడుకు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల కార్లు, బ్యాగులు.. ధరించే దుస్తులు, తాగే టీ కప్పుల నుండి ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనవై, అరుదైనవి. అయితే ఇప్పుడు అంబానీ కోడలు శ్లోకా మెహతా నెక్లేస్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
శ్లోకా మెహతా దేశంలోనే పేరుగాంచిన వజ్రాల వ్యాపారి రాసెల్ మెహతా కూతురు. అంబానీ, రాసెల్ మెహతా కుటుంబానికి గతంలో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా తమ విద్యను ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలో పూర్తి చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం పెళ్లివరకు వెళ్లింది. పెద్దల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు.
అయితే పెళ్లి రోజున నీతా అంబానీ తన కోడలికి 450 కోట్ల విలువైన నెక్లేస్ ని బహుమతిగా ఇచ్చారు. లెబనీస్ నగల వ్యాపారి మౌవాద్ ఈ నెక్లస్ ని రూపొందించారు. ఇందులో ప్రపంచం లోనే పెద్దదైన 407 కేరట్ల పసుపు రంగు వజ్రంతో పాటు, 91 తెలుపు డైమండ్స్ (200 కేరట్లు) రోజ్ గోల్డ్ చైన్ తో కలిపి ఉన్నాయి. ఇది సింగిల్ పీస్. దీన్ని డిజైన్ చెయ్యడం కూడా సాధ్యం కాదు అని తెలుస్తోంది. అయితే ఈ నెక్లెస్ కి గిన్నిస్ రికార్డు కూడా ఉంది.
ఈ నెక్లెస్ లో ఉపయోగించిన పసుపు రంగు వజ్రాన్ని 1980లలో ఆఫ్రికన్ కాంగోలో మైనింగ్ శిథిలాల నుంచి కనుగొన్నారు. ఈ వజ్రం మ్యూజియంలలో ప్రదర్శించబడటానికి ముందు, మౌవాద్ దాని నుండి అద్భుతమైన ఆభరణాలను చెక్కాడు. నెక్లెస్ డిజైన్ చేసిన తర్వాత, 2013లో దోహా జ్యువెలరీ అండ్ వాచ్ ఎగ్జిబిషన్‌లో దీన్ని తొలిసారిగా ఆవిష్కరించారు.
Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1
— Mouawad (@mouawad) August 2, 2018
End of Article