ప్రయాణాల్లో ఎక్కువగా నిద్రపోతాం.. కారణమేమిటో తెలుసా!

ప్రయాణాల్లో ఎక్కువగా నిద్రపోతాం.. కారణమేమిటో తెలుసా!

by Mounika Singaluri

Ads

చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రలో ఉండి వారి గమ్యస్థానాలను దాటి వెళ్ళిపోతూ ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంటాము. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నవ్వుకుంటాం కానీ ప్రయాణంలో మాత్రమే అంత మత్తు నిద్ర ఎందుకు పడుతుంది అనేది ఎవరు పెద్దగా ఆలోచించరు. నిజానికి నిద్రపోవటం ఒక యోగం. మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టిన వ్యక్తి చాలా అదృష్టవంతుడని చెప్పాలి.

Video Advertisement

కానీ నేటి పోటీ ప్రపంచంలో మనిషికి నిద్ర చాలా కరువైందని చెప్పాలి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ నిద్ర మరింత దూరమైంది. అటువంటి నిద్ర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం నేనున్నానంటూ ప్రతి మనిషిని పలకరిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు.

కానీ శాస్త్రీయంగా చెప్తున్న కారణాలు ఏమిటంటే మనల్ని చిన్నప్పుడు ఊయలలో పడుకోబెట్టి ఊపినప్పుడు మనకి తెలియకుండానే చాలా త్వరగా నిద్రపోతాం. మనం ప్రయాణాలు చేసినప్పుడు కూడా అదే జరుగుతుంది. తేలికగా శరీరం కదలటాన్ని రాకింగ్ సెన్సేషన్ అంటారు. బస్సులలో కార్లలో ప్రయాణం చేసినప్పుడు మన శరీరం అలాంటి రాకింగ్ సెన్సేషన్ కి గురవుతుంది.

అది మన మెదడుపై సమకాలీన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మన శరీరం మనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది దీనినే స్లో రాకింగ్ అంటారు. ఈ స్లో రాకింగ్ వలననే ప్రయాణంలో వెంటనే నిద్ర పడుతుంది. అయితే సాధారణ ప్రజల దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వారి సమాధానాలు ఎలా ఉన్నాయి అంటే..

కిటికీ పక్కన కూర్చున్నప్పుడు వచ్చే చల్లని గాలి మనల్ని నిద్రలోకి తీసుకు వెళుతుంది అని కొందరు, ప్రయాణాలు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్స్ మనసుకి దగ్గరగా ఉండవు అటువంటిప్పుడు నిద్ర పడుతుంది అని కొందరు సమాధానాలు చెప్పారు. ప్రయాణంలో నిద్రపోవటం మంచిదే కానీ మరీ మొద్దు నిద్ర మన గమ్యస్థానాలని దాటి తీసుకెళ్ళిపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది.


End of Article

You may also like