తలగడ పెట్టుకొని పడుకుంటున్నారా..? అలా చేస్తే వచ్చే నష్టాలు ఏంటో తెలుసా..?

తలగడ పెట్టుకొని పడుకుంటున్నారా..? అలా చేస్తే వచ్చే నష్టాలు ఏంటో తెలుసా..?

by kavitha

Ads

ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, నిద్ర పోవడం కూడా అంతే అవసరం.  సాధారణంగా 6 నుండి 8 గంటల వరకు నిద్ర పోవాలని చెబుతారు. కొందరు వ్యక్తులు తలగడ పై నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు తలగడను పెట్టుకుంటే అసౌకర్యంగా భావిస్తారు.

Video Advertisement

కంటినిండా నిద్రపోవాలి అంటే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లను విడిచిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్య అలవాట్లలో తలగడ పెట్టుకుని నిద్రపోవడం. ఆరోగ్యంగా ఉండాలంటే తలగడ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే తలగడ పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Sleeping-With-A-Pillow మరీ ఎత్తుగా లేకుండా, తక్కువ ఎత్తులో ఉండే తలగడను ఎంచుకోవాలి. పెద్ద తలగడ పెట్టుకోవడం వల్ల ప్రారంభంలో ఏమి తెలియకున్న కొద్ది రోజులు గడిచిన తరువాత మెడ నొప్పి మొదలవుతుంది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పి బాధించే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను నొప్పిగా అనిపిస్తే వెంటనే దిండు తీసేసి నిద్రపోవాలని చెబుతున్నారు. ఎత్తుగా ఉండే తలగడ ఉపయోగించడం వల్ల వెన్నెముక వంగిపోయి ప్రమాదం ఉందని అంటున్నారు.
అలా జరిగినపుడు డిస్క్‌ల మధ్య దూరం పెరిగిపోతుంది. దాంతో వెన్నునొప్పి వస్తుందట. చాలా మంది నిద్ర పోయేటప్పుడు దిండులో ముఖాన్ని పెట్టుకుని నిద్రపోతారు. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ చర్మం ఉపరితలం పై రంధ్రాలలో గాలికి ప్రవేశం ఉండదు. దాంతో ముఖం పై జిడ్డు ఏర్పడుతుంది. అది బ్లాక్ హెడ్స్ కి దారి తీస్తుంది. ఎత్తయిన తలగడ పెట్టుకోవడం వల్ల తలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదని, ఫలితంగా జుట్టుకు అవసరమైన పోషణ లభించదట. దానివల్ల జుట్టు రాలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా బాడిలోని కొన్ని భాగాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగక వారికి తరచుగా తిమ్మిర్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. అందువల్ల తక్కువ ఎత్తుగా, మెత్తగా ఉండే తలగడను ఉపయోగించాలి. ఇలా చేయడంతో నిద్ర చక్కగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

Also Read: కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయరు..!


End of Article

You may also like