గృహిణులకు పెద్ద సమస్య ఏంటి అంటే.. ఎక్కువ మొత్తాలలో పిండి ని నిల్వ చేసుకోవడం. పిండి ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేం. అందుకే.. ముందుగానే ఎక్కువ మొత్తం లో తెచ్చి పెట్టుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. అయితే.. ఇది అంత తేలికేమి కాదు. పదే పదే ఆ డబ్బాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మొత్తం లో పిండి నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశం ఉంది.

flour

మీరు కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నారా..? అయితే.. ఈ ట్రిక్ పాటించి చూడండి.
పిండి లో ఎండు మిరపకాయలు లేదా బిర్యానీ ఆకులను వేసి ఉంచండి. అప్పుడు పిండి పురుగులు పట్టకుండా ఉంటుంది. బిర్యానీ ఆకుల నుంచి వచ్చే వాసన పిండి కి పురుగులు పట్టకుండా అడ్డుకుంటుంది. కొంతమంది డైరెక్ట్ గా కవర్లు తోనే పిండి పెట్టేస్తూ ఉంటారు. ఐతే.. ఇలా కాకుండా పిండి ని తీసి డబ్బా లో పెట్టుకోవడం ఉత్తమం.