Ads
సాధారణ మొబైల్ ఫోన్.. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి.. ఒకరితో ఒకరిని కనెక్ట్ చేసింది. అదే ఫోన్.. స్మార్ట్ ఫోన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక మొత్తం ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. చాలా మందికి మొబైల్ లేనిదే రోజు గడవదు. ఇంకొందరు.. మనుషులతో కంటే.. స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. నిద్ర పోయేవరకు ఫోనో తోనే గడుపుతున్నారు. అయితే మొబైల్ వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. రాత్రి సమయాల్లో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ వాడితే.. అది కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Video Advertisement
గత సంవత్సరం ఇటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో బయటపడింది. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. బ్యూటీషియన్ గా పని చేస్తున్న ఓ మహిళ దివ్యాంగుడైన తన బిడ్డను చూసుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. తర్వాత తన బిడ్డ అవసరాల కోసం ఎక్కువగా ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉండేది. చీకట్లో కూడా గంటల తరబడి ఫోన్‌లో నిమగ్నమై ఉండేది. దీంతో ఆవిడకు తీవ్రమైన దృష్టిలోపం తలెత్తింది. దాదాపు ఏడాదిన్నరగా ఆవిడ ఈ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఏ వస్తువు సరిగా కనిపించేది కాదు. కొన్ని వస్తువులైతే బ్లర్‌గా, మరికొన్ని జిగ్ జాగ్ లైన్లలా కనిపించేవి. రాత్రుళ్లైతే ఒక్కోసారి కళ్లే కనిపించేవి కాదు.
దీంతో డాక్టర్ ఆమె జీవనశైలి, అలవాట్లు, సెల్ ఫోన్ వాడకం లాంటి వివరాలు తెలుసుకున్నారు. చివరగా ఆమెకు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారించారు. చీకట్లో మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుగు కళ్ల మీద 2 గంటల కంటే ఎక్కువగా పడటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. ఈ విషయాలను ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. విషయం బయటకొచ్చింది.
ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు. ఎక్కువ సేపు కంప్యూటర్లపై పని చేసేవారు, ట్యాబ్లెట్లు వాడే వాళ్లు ఈ సమస్యకు గురవుతున్నారు. దీనిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని, డిజిటల్ విజన్ సిండ్రోమ్ అని కూడా పేర్కొంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, తరచుగా విరామం తీసుకోవడం, స్క్రీన్ బ్రైట్‌నెస్ మరియు కాంట్రాస్ట్‌ని సర్దుబాటు చేయడం, అలాగే కళ్లను తేమగా ఉంచడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.
End of Article