ట్రాన్స్‌ఫర్ అయ్యాక స్మితా సబర్వాల్ చేపట్టనున్న కొత్త బాధ్యతలు ఏంటో తెలుసా..?

ట్రాన్స్‌ఫర్ అయ్యాక స్మితా సబర్వాల్ చేపట్టనున్న కొత్త బాధ్యతలు ఏంటో తెలుసా..?

by Mounika Singaluri

Ads

తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్త పేరుపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతమంది అధికారులను బదిలీలు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణలో ఉన్న ఐపీఎస్ అధికారులందరిలోకి స్మిత సబర్వాల్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొన్నటి వరకు ఆమె ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

Video Advertisement

సీఎం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్‌నును ట్రాన్స్‌ఫర్ చేసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ కుమార్ సల్తానియా TSFC సెక్రటరీగా ఉన్నారు.
2001 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది.

కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. స్మితా సబర్వాల్ పని సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను సీఎంవో కార్యదర్శిగా నియమించారు. చాలా రోజుల పాటు ఆ బాధ్యతల్లో ఉన్నారు.

సోషల్ మీడియాలో కూడా స్మితా సబర్వాల్ యాక్టివ్ గా ఉంటారు.తన కుటుంబంలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.బదిలీలు అనంతరం ఆమె తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా వెళ్లనున్నారు. కాగా స్మిత సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ అధికారిగా కేంద్ర సర్వీసులోని ఇంటెలిజన్స్ విభాగంలో పనిచేస్తున్నారు


End of Article

You may also like