Ads
స్త్రీకి పతిసేవకి మించిన పరమార్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఆమె పాతివ్రత్యమే సదా ఆమెనీ, ఆమె కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుందని చెప్పబడుతోంది. అయితే మన పురాణాల ప్రకారం అనేకమంది పతివ్రతలు ఉన్నారు. వారిలో ఒకరే ద్రౌపది. మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది. ఈమె ద్రుపదుని కుమార్తె.
Video Advertisement
సంతానం కోసం ద్రుపదుడు నిర్వహించిన యఙ్ఞం నుంచి ధ్రుష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. అయితే ఈమె పాండవులు అయిదుగురిని పెళ్లాడింది. అయితే పతివ్రత అంటే పతియే దైవంగా భావించే భార్య.అంటే భర్త తప్ప పర పురుషులను ఎరుగని భార్య.సాధారణంగా భర్త అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్క పురుషునితోనే సంసార బంధం ఉన్న స్త్రీని పతివ్రత అంటారు. మరి ద్రౌపదిని ఎందుకు ఈ జాబితాలో చేర్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు.అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది. అంటే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. అయితే పంచపాండవులు, ద్రౌపది వీరందరూ అయోనిజులే. నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. దీని వెనుక కథేంటంటే.. త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ ఇంద్రుడు సంహరించాడు.ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యార్హతను కోల్పోయాడు.
అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. అప్పుడు ఆయన ఇంద్రుడ్ని తపస్సు చెయ్యమని చెబుతాడు. అయితే ఆ సమయంలో దైవీకశక్తులు ఏవీ తోడుగా ఉండవు కాబట్టి పంచ ప్రాణశక్తులలో నాలుగు ప్రాణశక్తులను నమ్మకమైన మిత్రుల దగ్గర దాచి ఉంచామని చెబుతాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన నాలుగు ప్రాణశక్తులను యముడు, వాయువు, అశ్వినీదేవతల దగ్గర దాచి తపస్సు చేస్తాడు.
ఆ తర్వాత ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునులు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్వినీదేవతలు తమ దగ్గరున్న మహేంద్ర ప్రాణశక్తులను అనుగ్రహించగా.. నకుల,సహదేవులు జన్మించారు. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడు అని తెలుసుకున్న శచీదేవి..యఙ్ఞ కుండం నుంచి ద్రౌపతిగా జన్మించి, పంచపాండవులకు అర్థాంగి అయింది. అందుకే ఆమె పంచ కన్యలలో ఒకరిగా.. పతివ్రతగా పేరు గాంచారు.
End of Article