Ads
భారత్ లో ఆధ్యాత్మికత ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ దేవాలయాలు ఎంతో విశిష్టమైనవి. వింతలు, విశేషాలతో కూడుకుని ఉంటాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ని ప్రజలు వారి దేవుడిని విశ్వసించి పూజలు చేస్తుంటారు. హిందూ మతం లో ప్రతి దేవుడికి ప్రత్యేకమైన పురాణం ఉంటుంది..
Video Advertisement
వారి ఆవిర్భావం నుంచి, ఆ దేవుళ్ళ శక్తీ ని వివరించడం వరకు పురాణాలూ ఎంతగానో తోడ్పడుతుంటాయి. స్వయంభువు గా చెప్పుకునే పుణ్యక్షేత్రాల్లో ఉండే విశేషాలకు కొదవే లేదు. ఈ పుణ్య క్షేత్రాల్లో ఉండే వింతలకు, మర్మాలకి కారణమేంటో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. అలాంటి ఓ విశేషం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం.
శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఒకటి గా చెప్పుకునే అవతారం ఉగ్ర నరసింహ అవతారం. పురాణాల ప్రకారం భూమిని బాధిస్తున్న రాక్షసుడు హిరణ్యకశిపుని వధించడానికి శ్రీమహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారం ధరించారని చెబుతుంటారు. ఆ ఉగ్ర నరసింహుడికి భారత్ దేశమంతా దేవాలయాలు ఉన్నాయి. సాధారణం గా నరసింహుడి దేవాలయాన్ని గుహల్లోనూ, గుట్టలపైనా ఉంటాయి.
కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వయంభువు ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం మాత్రం పచ్చని అడవుల్లో ఉంటుంది. తెలంగాణ లోని జై శంకర్ భూపాల్ జిల్లా, మంగపేట మండలం, మల్లూరు గ్రామానికి దగ్గర్లోని అడవుల్లో ఈ దేవాలయం ఉంది. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట, హేమాచలం అని పిలుస్తారు. ఈ ఆలయ ధ్వజస్థంభం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. కొండ బంగారం పూత పూసినట్లు ఉండడంవల్ల హేమాచలం అనే పేరు వచ్చింది అని అంటారు. ఇక్కడ ఎన్నో ఔషధాలు కూడా దొరుకుతాయి.
source : Telangana Unexplored (facebook)
హేమాచలం అర్థచంద్రాకారంలో ఉంటుంది.. మల్లూరు గుట్ట నరసింహ స్వామి విగ్రహానికి వెంట్రుకలు ఉంటాయి. మనుషుల్లాగే, స్వామి వారి విగ్రహానికి కూడా చెమటలు పడుతుండడం ఇక్కడి దేవుని ప్రత్యేకత. ఈ స్వామి వారిని ఏమి కోరుకున్నా కచ్చితం గా జరుగుతుంది. ఇక్కడి ప్రజలంతా స్వామి వారిని విశేషం గా పూజిస్తారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం, దిలీప కులకర్ణి మహారాజు పాలనా సాగుతున్న సమయం లో ఈ ప్రాంతం లో తవ్వకాలు జరిపించారు.
ఓ రోజు స్వామి వారు మహారాజు కలలో కనిపించి గునపం తన నాభిలో దిగిందని, తన విగ్రహానికి భక్తులచే పూజలు చేయించాలని తెలిపారు. స్వామివారి ఆజ్ఞతో దిలీప కులకర్ణి మహారాజు అక్కడ దేవాలయం కట్టించారు. ఆ గునపం దిగిన స్థలం నుంచే స్రావాలు వస్తుంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు. నేటికీ ఈ విగ్రహం నుంచి స్రావాలు వస్తూనే ఉన్నాయి.
ఈ విగ్రహం పూర్తిగా నలుపు రంగులోనే కనిపిస్తుంది. ఈ శిలను తాకితే చర్మాన్ని తాకినంత మెత్తగా ఉంటుంది. ఎక్కడ నొక్కినా సొట్టపడి తిరిగి మాములుగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ విగ్రహానికి చెవులు, ముక్కు, మీసాలను కూడా మనం గమనించవచ్చు. ప్రపంచం మొత్తం లో వెంట్రుకలు కలిగిన ఏకైక విగ్రహం మల్లూరు గుట్ట నరసింహస్వామివారిది. నిరంతరం నాభి నుంచి స్వేదం వస్తూ ఉంటుంది.
అలా రాకుండా ఉండడానికి చందనం ఉంచుతారు. ఆ తరువాత ఈ చందనాన్ని మహాప్రసాదం గా ఇస్తారు. ఈ చందనాన్ని తీసుకుంటే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా కాలసర్ప దోషానికి తైలాభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకతలలో ఒకటి అని అంటారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడా కూడా స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయరు. కానీ ఈ ఆలయంలో స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారట.
అలాగే, స్వామి వారి పాదాల వద్ద నుంచి నీరు ధార గా పడుతుంటుంది. దీనిని చింతామణి జలధార అని పిలుస్తారు. ఎక్కడ నుంచి ఈ నీరు వస్తోందో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకప్పుడు రాణి రుద్రమ దేవి పేరు తెలియని వ్యాధి తో బాధపడుతుంటే.. ఈ జలధార నుంచి వచ్చే నీటిని తాగి పూర్తి గా కోలుకుందని చెబుతుంటారు.
ఈ నీటిని విదేశాల్లో భక్తులకు పంపించడం ఆనవాయితీ వస్తోంది. అంతే కాదు.. ఈ విగ్రహం వేసవి లో పలుచగా ఉంటుంది. మిగిలిన సమయాల్లో మాత్రం ముందుకు వచ్చి నాలుగడుగుల వరకు ముందుకు వచ్చి కనిపిస్తుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు.
End of Article