Ads
సినీ తారలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం తెలిసిందే. హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోల నుండి మొదలు పెడితే వారి మూవీ అప్డేట్స్ వరకు అభిమానులు క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో త్రోబ్యాక్ పిక్ ట్రెండ్ నెట్టింట్లో ఎక్కువైంది.
Video Advertisement

Tollywood Heroine Samantha images

Tollywood Heroine Samantha images
తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ వైవిధ్యభరితమైన చిత్రాలలో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కోలీవుడ్ లో విజయ్ దళపతి, సూర్య, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది.
ఆమె ఎవరో కాదు హీరోయిన్ సమంత. అంతేకాకుండా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా తనదైన మార్క్‌ను చూపించింది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో విజయ్ దేవర కొండ హీరోగా నటించగా, సమంత హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలోని పాటలు, ట్రైలర్ తో ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సమంత సినిమాల నుండి సంవత్సరం పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న డిసిషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
Also Read: “చంద్రముఖి 2” మూవీలో రజనీకాంత్ పోషించిన రాజు పాత్ర చేసిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?
End of Article
