“నిజాం” వారసుడి సంపద అయిన 4000 కోట్లు… ఎలా ఆవిరి అయ్యాయో తెలుసా..?

“నిజాం” వారసుడి సంపద అయిన 4000 కోట్లు… ఎలా ఆవిరి అయ్యాయో తెలుసా..?

by kavitha

Ads

హైదరాబాద్ చివరి మరియు ఎనిమిదవ నిజాం అయిన ముకర్రం ఝా, యువరాజు ఆజం జా మరియు యువరాణి దుర్శేహ్వార్‌లకు 1933లో జన్మించాడు. అతను తన జీవితంలో కొంత భాగాన్ని ఆస్ట్రేలియా  గడిపిన తర్వాత టర్కీకి వలస వెళ్లాడు. ముకర్రం జా ఇస్తాంబుల్‌లో ఈ ఏడాది జనవరి 12న 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశాడు.

Video Advertisement

ముకర్రం ఝా చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కామసీదులోని అసఫ్‌జాహీ రాజుల సమాధుల దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మరణించే ముందు ముకర్రం ఝా సుమారు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని ముకరం కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
1967లో ఎనిమిదో మరియు చివరి నిజాంగా ముకర్రం ఝా ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆయనకు తన తాతయ్య నుండి డజనుకు పైగా ప్యాలెస్‌లు, మొగల్ కళాఖండాలు, వజ్రాలు, వంద కిలోల బంగారం, వెండి ఆభరణాలు,  విలువైన రాళ్లు వారసత్వంగా సంక్రమించాయి. అయితే, ఆయన మరణించే ముందు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయారు. ఆ సంపద ఎలా పోయిందనే విషయాన్ని “ద లాస్ట్ నిజాం: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్” లో జాన్ జుబ్రిస్కీ వెల్లడించారు.

ముకర్రం ఝా చనిపోయే రోజుకి ఆస్తులకు సంబంధించి కేసులు వందల సంఖ్యలో కోర్టుల్లో నడుస్తున్నాయి. ఆ ఆస్తులు కోసం డజన్ల మంది నిజాం వారసులు కేసులు వేశారు. కోర్టుల్లో తమకే వస్తాయని వాదించారు. వీటిపై ఇప్పటికి విచారణలు కొనసాగుతున్నాయి. ముకర్రం ఝా రచయిత జుబ్రిస్కీతో  “మా తాతయ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వారసత్వంగా భారీ సంపద వచ్చింది. ఆయన 1920ల్లో 200 మంది భార్యలతో కింగ్ కోఠి ప్యాలెస్‌లో విలాసంగా జీవించేవారు. 1967లో ఆయన చనిపోయే సమయానికి ప్యాలెస్‌లో 42 మంది భార్యలు ఉన్నారు.
అయితే అప్పటికి పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. ఎంతో సందపను నిజాం కోల్పోయారు’’ అని చెప్పినట్టుగా ఆ పుస్తకంలో తెలిపారు. ‘‘మా తాతయ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాయంత్రం ప్యాలస్‌లో ఉండే తోటకు వెళ్లేవారు. అప్పుడు ఆ తోటలోకి ఆయన భార్యలు అందరు వచ్చేవారు. అప్పుడు మా తాతయ్య ఏ రాణి భుజం మీద తెల్లని రుమాలు వేస్తే, ఆమె రాత్రి తొమ్మిది గంటలకు ఆయన గదిలోకి వెళ్ళేవారని’’అని ముకర్రం ఝా తనతో తెలిపినట్లుగా జుబ్రిస్కీ తన పుస్తకంలో రాశారు.
అయితే, ఈ విలాసాల మధ్య ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారులు, మనవళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన మరణించే నాటికి సుమారు వంద మంది దాకా వారసులు ఉండేవారు. అది 2005నాటికి 500 దాటిపోయింది. వీరిలో అనేక మంది ఆస్తిలో వాటా కోరుతూ చివరి నిజాం ముకర్రం ఝా పై కోర్టులో కేసులు వేశారు.

ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్రలో రాసిన కరాకా ప్రకారంగా  ‘‘1950లలో నిజాం యొక్క ఆస్తుల విలువ 135 కోట్లు. వీటిలో నగదు రూపంలో 35 కోట్లు ఉండేవి. వజ్రాలు, నగలు 50 కోట్లు ఉండేవి. భవనాలు, ఇతర ప్యాలెస్‌లు విలువ 50 కోట్లు ఉండేవి.’’ 1949లో న్యూయార్క్ టైమ్స్‌  నిజాం మొత్తం సంపద రెండు బిలియన్ అమెరికా డాలర్లు అని అంచనా వేసింది. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం 16 లక్షల కోట్లు రూపాయలు.
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వం పాట సంస్థానాలన్నీటిని అధీనంలోకి తీసుకోవడం కొనసాగించారు. ఆ సమయంలో ముకర్రం ఝా ఇంగ్లాండ్, యూరప్ లలో వంతెనలు కట్టడం, మందు పాతరాలు పెట్టడం నేర్చుకుంటున్నారు. చివరికి 1967లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయిన తరువాత నిజాం వారసుడిగా బాధ్యతలు తీసుకున్న ముకర్రం ఝా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. మా తాతయ్య వద్ద 14,718 మంది పని చేసేవారు. అలాగే ఆయన 42 మంది భార్యలు, 100 మంది పిల్లలున్నారు. వీరందరి ఖర్చులు ఎక్కువగా ఉండేవి.
చౌమహల్లా ప్యాలెస్ కాంప్లెక్స్‌లో దాదాపు 6,000 మంది సిబ్బంది ఉండేవారు. మరో 5,000 మంది రక్షణ సిబ్బంది ఉండేవారు. ఇక నిజాం వంట శాలలో రోజుకు 2,000 మందికి భోజనం తయారుచేసేవారు. దానిలో ఎక్కువ శాతం సేవకులు బయట హోటల్ లలో అమ్ముకునేవారని ఒక ఇంటర్వూలో చెప్పారు. నిజాం గ్యారేజీలో రోల్స్ రాయిస్ లాంటి ఖరీదైన కార్లు ఉండేవి. ఈ కార్ల కోసం పెట్రోలకు అప్పట్లోనే సంవత్సరానికి 90,000 అమెరికా డాలర్లు ఖర్చు అయ్యేది అని చెప్పారు.
ఇక 1968లో ముకర్రం ఝాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. నిజాం సంపదను వారసులంతా సమానంగా తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసును వేసింది ముకర్రం ఝా సోదరి షెహజాదీ పాషా. ఆ తర్వాత, పశ్చిమ ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పనిచేస్తున్న తన కేంబ్రిడ్జ్‌ ఫ్రెండ్ జార్జ్ హాబ్‌డేను ముకరం జా కలవడానికి వెళ్లారు. అక్కడ ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. ఆయన అక్కడే ఓ ఫామ్ హౌజ్ తీసుకున్నారు.  అప్పుడే ఆయనకు గొర్రెలను పెంచే ముర్చిసన్ హౌస్ స్టేషన్‌ గురించి తెలిసింది.ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ సైమన్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. హెలెన్ ఎయిడ్స్‌తో మరణించారు. కుమారుడు, ప్రిన్స్ ఒమర్ జా డ్రగ్స్‌ను ఓవర్ డోస్ తీసుకోవడంతో మరణించారు. ఇక ఆస్ట్రేలియాలో ఆయన ఎస్టేట్ 500 ఎకరాల్లో విస్తరించింది. ఇటు హైదరాబాద్‌లో ఆయన ఆస్తులను ఇతరులు ఆక్రమించడం క్రమంగా పెరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ముకర్రం ఝా మిలియన్ డాలర్ల ఆస్తులు కొనుగోలు చేశారు. వీటిలో భారీ బుల్డోజర్లు, ఒక భారీ షిప్, లాండ్‌మైన్‌లను కనిపెట్టే యంత్రాలు, ఒక బంగారు గని ఉన్నాయి. అయితే,  ఖర్చులు పెరగడంతో తన దగ్గర ఉన్న విలువైన వజ్రాలు, ఆభరణాలను స్విట్జర్లాండ్‌ లో విక్రయించారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఖర్చులు రోజు రోజుకి  పెరడడంతో డబ్బు కోసం ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  అప్పులు పెరగడంతో ముకరం ఝా దివాళా తీసే స్థితికి వచ్చారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టుకు చెందిన విలువైన ఆభరణాలను అమ్మడం పై ఆంక్షలు విధించింది. 1996 లో ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ఆస్తులను అమ్మేయాల్సి వచ్చింది. ఆయన నౌకను అక్కడి అధికారులు జప్తు చేసారు. బుల్డోజర్లు, కార్లను వేలం వేశారు.
ఆ ఏడాది ఒకరోజు శుక్రవారం నమాజ్ కు వెళ్తున్నానని సెక్రటరికీ చెప్పి వెళ్లారు. ఆ తరువాత ఆయన ఆస్ట్రేలియాలో కనిపించలేదు. తన మీద ఉన్న కేసులకు భయపడి తుర్కియేకు వెళ్లిపోయారు. ఆయన జీవితాంతం అక్కడే ఉన్నారు. 2002 లో భారత ప్రభుత్వం నిజాం ట్రస్టు నుంచి తీసుకున్న ఆభరణాలకు 22 మిలియన్ డాలర్లు చెల్లించినప్పటికి అది మార్కెట్‌ విలువలో కేవలం పావు వంతు మాత్రమే చెబుతారు. 2023 ప్రారంభంలో ముకరం ఝా మరణం, తరువాత ఆయనకు హైదరాబాద్‌ లో అధికార లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

Also Read: నిజాం కాలంలో లాక్ డౌన్, క్వారెంటైన్ ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు ఎందుకు పెట్టారంటే?


End of Article

You may also like