ట్రాఫిక్ భరించలేక ఆఫీస్ కి వెళ్ళడానికి ఈ వ్యక్తి వింతగా ఏం చేసాడో తెలుసా.?

ట్రాఫిక్ భరించలేక ఆఫీస్ కి వెళ్ళడానికి ఈ వ్యక్తి వింతగా ఏం చేసాడో తెలుసా.?

by Megha Varna

Ads

సాధారణంగా పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఆ ట్రాఫిక్ నుండి బయట పడటం పెద్ద టాస్క్. ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సమయానికి పనులు పూర్తి చేసుకోవాలని మనం అనుకుని ఎంతో వేగంగా బయలుదేరుతూ ఉంటాం. కానీ తీరా చూస్తే ట్రాఫిక్ లో చిక్కుకు పోవాల్సి వస్తుంది. ఈ బాధ అందరూ పడేదే. ఉదయం పూట ఆఫీస్ కి వెళ్లాలంటే ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయట పడతారో తెలీదు.

Video Advertisement

అందుకే చాలామంది ఒక గంట ముందే బయలుదేరుతూ ఉంటారు. ఒకపక్క ట్రాఫిక్.. మరోపక్క కాలుష్యం. దానికి తోడు ఒత్తిడి ఇలా ఎంతో చికాకుగా ఉంటుంది. అయితే చాలామంది ట్రాఫిక్ నుండి బయట పడాలంటే చిన్న చిన్న ట్రిక్స్ ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది అయితే సిగ్నల్ పక్కన పెట్రోల్ బంక్ ఉంటే దానిలో నుంచి వచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని దేశాలలో అయితే బాగా డబ్బున్న వాళ్ళు ట్రాఫిక్ బాధలు ఎక్కువగా ఉంటాయని హెలికాప్టర్ లో తిరుగుతూ ఉంటారు.

అయితే అది అందరికీ సాధ్యం కాదు. జర్మనీలో ఒక అతను మాత్రం ఒక వింత ఆలోచనతో ట్రాఫిక్ బారినపడకుండా ఆఫీస్ కి వెళ్ళడం మొదలు పెట్టాడు. మరి అతను ట్రాఫిక్ ని భరించలేక ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. జర్మనీ దేశంలో బెంజిమెన్ డేవిడ్ అనే ఒక వ్యక్తి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ఆ నగరంలో ఉన్న ఇస్సార్ నది మీదగా ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే ఆ నది లో జల రవాణా సౌకర్యం లేదు.

అయినప్పటికీ ఏం చేశాడంటే తన వస్తువులను, బట్టల్ని ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లో పెట్టి ప్రతిరోజు ఆ నీటిలో ఈదుకుంటూ ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టాడు. సాయంత్రం కూడా ఈత కొట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. గత రెండు సంవత్సరాలుగా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు డేవిడ్. ఇతని ఇంటి నుండి ఆఫీస్ కి దూరం ఒకటిన్నర కిలో మీటర్లు. ఇలా వెళ్లడం వల్ల ట్రాఫిక్ బాధ ఉండదు. అలానే స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే అని డేవిడ్ అన్నాడు.

watch video:


End of Article

You may also like