Ads
చిన్నపిల్లలు చదువుకునే సమయంలో తెలిసి తెలియకుండా కొన్ని సమాధానాలు రాస్తారు. అవి రాసింది చిన్నపిల్లలు కాబట్టి వాటిని చూస్తే నవ్వు వస్తుంది. కొన్ని సార్లు అయితే వాళ్ల సమాధానాలు చూస్తే, “వీళ్ళకి ఈ వయసులో ఇంత తెలివి ఎలా వచ్చింది?” అని ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవల ఇలా ఒక అబ్బాయి ఒక ప్రశ్నకు సమాధానం రాశాడు. ఉపమాలంకారం గురించి రాయమని టీచర్ వర్క్ ఇచ్చారు. అందుకు, ఆ స్టూడెంట్ రాసిన సమాధానం చూస్తే ఉపమాలంకారాన్ని ఇలా కూడా అర్థం చేసుకుంటారా అని అనిపిస్తుంది.
Video Advertisement
ఆ విద్యార్థి తన సమాధానంలో, “ఉపమ. మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కారం, ఉప్పు, నూనె, గిన్నె. గిన్నెలో ఉప్మా రవ్వ వేసుకొని బాగా వేయించాలి ఉప్పు కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మరిగించుకోవాలి అంతే ఉప్మా రెడీ” అని రాశాడు. అందులో ఉపమ అని ఉప్మా గురించి రాశాడు. “ఉప్మా రెడీ” అని రాయడానికి “ఉపమ రెడ్డి” అని రాశాడు. ఉపమాలంకారం గురించి అడిగితే ఉప్మా గురించి రాయమని అర్థం అయ్యింది ఏమో. ఉప్మా చేసుకునే విధానాన్ని, అదేదో టీవీ షోలో చూపించినట్టు చాలా పద్ధతిగా, పదార్థాలతో పాటు రాశాడు.
అంతే కాకుండా, ముందు వేయించాలి, తర్వాత మరిగించాలి అంటూ తయారీ విధానాన్ని కూడా చాలా వివరంగా రాశాడు. అతని చేతిరాత చూస్తూ ఉంటే అతను పాఠశాలలో చదువుకునే ఒక స్టూడెంట్ అని తెలుస్తోంది. చేతిరాత విధానం చూస్తూ ఉంటే చిన్నపిల్లలు అని అర్థం అవుతుంది. సాధారణంగా చాలా మంది టీచర్ ఏదైనా ప్రశ్న ఇస్తే, సమాధానం రాయకుండా వదిలిపెట్టకుండా, తమకు వచ్చిన సమాధానాన్ని రాసి వస్తారు. ఖాళీగా వదిలేయడం అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. కొన్ని సార్లు అక్కడ అడిగిన ప్రశ్న వేరే ఉంటుంది.
వీళ్లు రాసిన సమాధానాలు వేరే ఉంటాయి. అయినా కూడా నింపాలి అనే ఉద్దేశంతో ఆన్సర్ షీట్ లో ఏదో ఒకటి అది రాసి వచ్చేస్తుంటారు. కొంత మంది పిల్లలు అయితే, ప్రశ్నని చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, దానికి తగ్గట్టు సమాధానం రాస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఉపమాలంకారం అనే ప్రశ్న చూసి అందులో ఉపమ అనే పదం మాత్రమే చూసి ఉప్మా గురించి అడిగారు అనుకొని చాలా వివరంగా ఉప్మా చేసుకునే పద్ధతిని రాశాడు. అందుకు టీచర్ 25 కి 0 మార్కులు వేశారు.
ALSO READ : కల్కి 2898 AD కంటే ముందే… “దీపికా పదుకొనే” తెలుగు సినిమాలో నటించారా..? ఏ సినిమా అంటే..?
End of Article