ఆ టీచర్ అంటే ఈ పిల్లలకు ఎంత ప్రేమో చూడండి.. ఆమె వెళ్ళిపోతోందని తెలిసి వీళ్ళేం చేసారంటే..?

ఆ టీచర్ అంటే ఈ పిల్లలకు ఎంత ప్రేమో చూడండి.. ఆమె వెళ్ళిపోతోందని తెలిసి వీళ్ళేం చేసారంటే..?

by Anudeep

Ads

ప్రతి వ్యక్తి జీవితంలోను తల్లితండ్రుల తరువాత గురువులు కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే.. పిల్లలు ఎదుగుతున్న సమయంలో ఎక్కువ సేపు స్కూల్ ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల సమక్షంలో గడుపుతారు. అందుకే ఉపాధ్యాయులకు అంత ప్రాధాన్యత ఉంటారు. వారు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి పిల్లల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.

Video Advertisement

అయితే.. చదువు పూర్తయ్యాక.. ఆ ఉపాధ్యాయులకు దూరం అయ్యే సమయంలో మనం కొంత బాధపడుతూ ఉంటాం కూడా.. కొందరు ఉపాధ్యాయులు మనపై చెరగని ముద్ర వేస్తుంటారు.

sampa 1

అలాంటి టీచర్లకు ఏ కారణంతో అయినా మనం దూరం అవ్వాల్సి వస్తే కన్నీళ్లు పెట్టేసుకుంటూ ఉంటాం. తాజాగా.. ఇలాంటి ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన కటియాహట్ బికేఏపీ బాలికల పాఠశాలలో సంపా అనే ఉపాధ్యాయిని గత కొన్నేళ్లుగా టీచర్ గా పని చేస్తున్నారు. అయితే.. ఆమె సాధారణ బదిలీ కింద మరో ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యారు.

sampa 2

ఈ విషయం తెలియడంతో విద్యార్థులు ఎంతో ఆవేదనకు గురి అయ్యారు. తమకి ఇష్టమైన టీచర్ కి భిన్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆమె కళ్ళకి గంతలు కట్టి పాఠశాల గ్రౌండ్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అందరు విద్యార్థులు మోకాళ్లపై గులాబీలు పట్టుకుని కూర్చున్నారు. టీచర్ కిందకి రాగానే `రబ్​నే బనాదీ జోడి` సినిమాలోని పాటని ఏకకంఠంతో పాడారు. వారి ప్రేమని చూడగానే ఆ టీచర్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత వారికి కూడా ధైర్యం చెప్పి వారి వద్ద వీడ్కోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 


End of Article

You may also like