Ads
‘మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’ అనే నినాదం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నినాదాల్లో ఒకటి. దానిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు అందించారు. రెండుసార్లు మరియు భారత జాతీయ సైన్యం నాయకుడిగా పని చేశారు. అంతే కాదు ఈయన ‘ఆజాద్ హిందూ ఫౌజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
Video Advertisement
ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలని నమ్మి గాంధీజీతో విభేదించారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలకపాత్ర వహించారు. అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు.1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. కానీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.
అయితే నేతాజీ విద్యార్థిగా ఉన్న సమయం లో తన స్నేహితుడు క్షేత్ర చంద్ర చటోపాధ్యాయ కి అనేక లేఖలు రాసారు.. వాటిలో తాను వివేకా నందుని నుంచి ప్రేరణ పొందుతున్నా అని రాసారు. బోస్ మాతృ భాష అయిన బెంగాలీ లో రాసిన ఈ లేఖలు ప్రస్తుతం ఈలేఖలు క్షేత్ర చంద్ర చటోపాధ్యాయ కుమారుడి వద్ద ఉన్నాయి. 1915 లో మొదటి లేఖను రాసిన బోస్..అందులో ” ఈ సమయంలో గొప్ప అవసరం జాతీయవాదం యొక్క అలలు మనపైకి దూసుకుపోతున్నాయని నేను నమ్ముతున్నాను. అలాగే వివేకానంద ఆలోచనలకూ రూపం ఇద్దాం..” అని రాసారు.
అలాగే కేంబ్రిడ్జి నుంచి రాసిన మరో లేఖలో ..” కేంబ్రిడ్జి కి వెళ్లడం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. సంస్కృత సాహిత్య చరిత్ర, భారతీయ ఆలోచన మరియు సంస్కృతి యొక్క పరిణామం, భారతీయ తత్వశాస్త్రం లేదా భారతీయ జాతి మరియు ఆచారాల పరిణామం యొక్క చరిత్రపై ఒక్క పుస్తకం కూడా లేనందుకు నాకు బాధగా ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో మనం కేవలం గొర్రెల మందలం మాత్రమే.” అని ఆయన రాసారు.
అలాగే మరో లేఖ సహాయ నిరాకరణ ఉద్యమ సమయం లో రాసారు సుభాష్ చంద్ర బోస్. ” సహాయ నిరాకరణ ఉద్యమ నేపథ్యం లో భారతదేశంలో తాజా మూలధనాన్ని పెట్టుబడి పెట్టడానికి బ్రిటిష్ పెట్టుబడిదారులు భయపడుతున్నారు. శారదా మఠానికి చెందిన శంకరాచార్యులు కాంగ్రెస్ సభకు హాజరయ్యారు. అలాగే ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు గాంధీని గౌరవిస్తున్నారు.” అని బోస్ తన స్నేహితుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
End of Article