యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో సూపర్ హిట్ చేస్తూ ఆకట్టకుంటోంది. పుట్టింది కేరళలోనే అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తోంది సుమ.

Video Advertisement

 

 

టాలీవుడ్‌లో సుమ యాంకరింగ్‌ అంటే ఓ బ్రాండ్. ఏ సినిమా ఈవెంట్ అయినా.. ఎంత పెద్ద షో అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. ఆమె హోస్టింగ్ చేస్తుందంటే.. హమ్మయ్య ఇక చూసుకోవాల్సిన పనిలేదు. ఓ మూడు గంటలు మనం రిలాక్స్ అయిపోవచ్చు. ఆమె చూసుకుంటుంది అని అనుకుంటారు ఈవెంట్ ఆర్గనైజర్స్. వేలాది కార్యక్రమాలను హోస్ట్ చేసిన యాంకర్ సుమ.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది.

suma got some injuries during foregin trip..

 

సుమకి సోషల్ మీడియా లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమెను ఇంస్టాగ్రామ్ లో 2 .4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. తాజాగా సుమ ఇంస్టాగ్రామ్ లో తన కాళ్లకు గాయాలైన పిక్చర్ ఒకటి పెట్టింది. దీంతో ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. యాంకర్ సుమ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, స్విట్జర్లాండ్ దేశాల్లో విహారయాత్ర కోసం వెళ్లింది.

suma got some injuries during foregin trip..

ఎప్పటికప్పుడు ఈ ట్రిప్ గురించి ఫోటోలు, వీడియోలు ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంది. ట్రిప్ లో బాగా తిరగడం వల్ల తన కాళ్లకి గాయాలు అయ్యాయని సుమ ఒక పోస్ట్ పెట్టింది. షూస్ కొరికేయడంతో గాయాలు అయి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని కాలి వేళ్లకి ప్లాస్టర్స్ వేసిన ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

suma got some injuries during foregin trip..

ఇక మరోవైపు తాజాగా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందని కామన్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని యాంకర్ సుమ ఇన్ స్ట్రాలో ఆడియన్స్ ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు. యాంకర్ సుమ సైతం ఆది పురుష్ ఈవెంట్ మిస్ అయ్యానని బాధపడుతూ వీడియో కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో చిత్ర బృందం గురించి ప్రస్తావిస్తూ ప్రభాస్ కి బెస్ట్ విషెస్ చెప్పింది.

 

Also read: బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏదో తెలుసా..?