Ads
మనుషులకు డి విటమిన్ ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. డి విటమిన్ అవసరమైనంత ఉంటేనే కండరాలు, ఎముకలు బలం గా ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా.. మెదడు చురుగ్గా పని చేయాలంటే కూడా డి విటమిన్ తప్పనిసరిగా కావలి. పిల్లలే కాదు.. చాలా మంది పెద్దల్లో కూడా డి విటమిన్ ఉండడం లేదు.
Video Advertisement
ఈ రోజుల్లో బయట ఎండా తగలకుండా రోజు గడిపేసేవారు కోకొల్లలు ఉన్నారు. ముఖ్యం గా అపార్ట్మెంట్స్ లో ఉండేవారు ఎండకు దూరం గానే ఉంటున్నారు. దీనివలన.. ఇంత ఉష్ణ దేశం లో కూడా చాలా మంది డి విటమిన్ లోపం తో బాధపడాల్సి వస్తోంది. కొన్ని లక్షణాల ద్వారా మనలో డి విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించవచ్చు. ఆ లక్షణాలు మీలో కూడా ఉన్నాయో లేదో తెలుసుకోండి.
కారణం లేకుండా నీరసం రావడం, అలసట గా ఉండడం, అస్తమానం తలనొప్పి రావడం, ఆలోచన శక్తీ కూడా లేకపోవడం, ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు మీలో ఉంటె.. మీరు ఆలోచించుకోవాల్సిందే.
అలాగే తరచుగా చర్మం పై పగుళ్లు కనిపించడం, కండరాల నొప్పి రావడం, నడుము నొప్పి, హెయిర్ ఫాల్, ఒత్తిడి ఫీల్ అవుతూ ఉండడం, అనారోగ్యం వస్తూ ఉండడం, ఉన్నట్టుండి బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
అయితే ఈ లక్షణాలు మీలో ఉండడం వలన కంగారు పడకండి. ఫుడ్ ద్వారా కూడా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. రొయ్యలు, కోడిగుడ్లు, చేపలు, చీజ్, నెయ్యి, పన్నీర్, పలు, పెరుగు, కమలపళ్లు, బాదాం, గోధుమలు, ఓట్స్, రాగులు, వంటి పదార్ధాల్లో డి విటమిన్ పుష్కలం గా లభిస్తుంది. పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యుని లేలేత కిరణాలు కూడా డి విటమిన్ ను అందిస్తాయి. కాబట్టి మీలో డి విటమిన్ లోపం ఉంటె శరీరానికి పుష్కలం గా అందించండి.
End of Article