వర్కౌట్లు చేస్తున్నపుడు ఈ లక్షణాలు కనిపించినట్లయితే గుండె సమస్యలు ఉన్నట్లే..!

వర్కౌట్లు చేస్తున్నపుడు ఈ లక్షణాలు కనిపించినట్లయితే గుండె సమస్యలు ఉన్నట్లే..!

by kavitha

Ads

వ్యాయామం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల యాక్టివ్ గా, ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ మధ్య కాలంలో వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటుతో చనిపోతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు వర్కౌట్లు చేస్తున్నపుడే గుండెపోటు వచ్చింది.

Video Advertisement

ఇలా ఆయన ఒక్కరే కాకుండా ఈ మధ్య కాలంలో వర్కౌట్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపించినట్లయితే గుండె సమస్యలు ఉన్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గుండె వేగంగా కొట్టుకోవడం:

వర్కౌట్  చేసేటపుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. చెస్ట్ పెయిన్ వస్తుంది. అసౌకర్యంగా అనిపించినపుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. గుండె వేగం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కొద్దిగా వర్కౌట్ చేస్తే మంచిది.

విపరీతమైన అలసట:

వర్కౌట్  చేసే సమయంలో చాలా అలసటగా ఉంటుంది. విపరీమైన అలసట వస్తే మాత్రం వారికి గుండె సమస్య ఉందని అర్ధం. రక్తనాళాలను చెడు కొలెస్ట్రాల్ నిరోధించడానికి వర్క్ చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను ప్రభావితం చేస్తుంది.

డీహైడ్రేషన్:

వర్కౌట్  చేస్తున్నప్పుడు కొందరు డీహైడ్రేషన్ కి లోనవుతారు. ఇలాంటి సమయంలో ద్రవాలను, పొటాషియం,  ఎలక్ట్రోలైట్లు, సోడియంను కోల్పోతారు. దీంతో హార్ట్ బీట్ కి ఇబ్బంది కలుగుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

వర్కౌట్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారవచ్చు. ఇది గుండె సమస్యను సూచిస్తుంది.  అందువల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినపుడు కాసేపు వ్యాయామాన్ని ఆపాలి.

ఛాతి నొప్పి:

గుండెపోటు రావడానికి ముందుగా ఛాతిలో నొప్పి వస్తుంది. వర్కౌట్ చేస్తున్నప్పుడు కనుక ఛాతినొప్పి వస్తుంటే తేలిగ్గా తీసుకోకూడదు. అది ఒక లక్షణంగా భావించాలి.

తల తిరగడం:

గుండెపోటు వచ్చే ముందుగా  తల తిరగడం, కళ్ళు తిరుగుతున్నటుగా అనిపిస్తుంది.  ఇలాంటి సమస్యలు వచ్చినపుడు వెంటనే వర్కౌట్ మానేయాలి.

వర్కౌట్ చేస్తున్నప్పుడు పైన చెప్పిన  ఆరు లక్షణాలు కనిపించినట్లయితే సంబంధిత నిపుణులను వెంటనే సంప్రదించడం మంచిది.

Also Read: ఉపవాసం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?


End of Article

You may also like